బట్లచందారం భూముల వివాదం: “భూమి వదలము… ప్రాణాలైనా ఇస్తాం” రైతుల హెచ్చరిక
తెలంగాణలోని బట్లచందారం గ్రామంలో భూముల స్వాధీనం అంశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వ నోటిఫికేషన్‌పై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “భూములు వదలము… అవసరమైతే ప్రాణాలైనా ఇస్తాం” అంటూ హెచ్చరిస్తున్నారు. గ్రామానికి చెందిన రైతులు చెబుతున్న వివరాల ప్రకారం, సుమారు 235 ఎకరాల పట్టభూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ భూములే తమ జీవనాధారం అని రైతులు అంటున్నారు. తరతరాలుగా సాగు చేస్తున్న భూములను వదిలి ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు….

