మత రాజకీయాలపై మరోసారి దుమారం.. మోదీ వ్యాఖ్యలపై విహెచ్ ఫిర్యాదు
ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ పార్టీని “ఎంఐఎంఎంసీ అంటే ముస్లిం లీగ్ మావోయిస్టు కాంగ్రెస్” అంటూ వ్యాఖ్యానించిన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా సమర్పించారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బీజేపీ సభలో ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు…

