మీనాక్షి నటరాజన్ నామినేషన్ వివాదం.. బీజేపీకి రాజ్యసభ సీటు అప్పగించేందుకే రాజకీయ గేమ్?

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఒకవైపు ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించగా, మరోవైపు బీజేపీ అభ్యర్థులు ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలకు తావిస్తోంది. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణలో నమోదైన కేసుల వివరాలను నామినేషన్ అఫిడవిట్‌లో వెల్లడించలేదంటూ బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ అభ్యంతరాలను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు….

Read More

మీనాక్షి నటరాజన్ నామినేషన్ వివాదం: తెలంగాణ నుంచి సమాచారం లీకైందా? సుప్రీంకోర్టుకు కాంగ్రెస్, రాజకీయంగా కొత్త అనుమానాలు

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అత్యవసర విచారణ జరపాలని పిటిషన్ దాఖలు చేసింది. కాంగ్రెస్ వాదన ప్రకారం, మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణలో ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదని, కేవలం కోర్టు నోటీసు మాత్రమే ఉందని పేర్కొంది. అలాంటి పరిస్థితిలో నామినేషన్‌ను తిరస్కరించడం చట్టబద్ధం కాదని పార్టీ అభిప్రాయపడుతోంది. అంతకుముందు కాంగ్రెస్…

Read More