నీట్ పేపర్ లీక్‌పై కాంగ్రెస్ ఆందోళన.. హైదరాబాద్ రాజ్‌భవన్ వద్ద నిరసనలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నీట్ (NEET) పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో విద్యార్థుల నిరసనలకు మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంకా గాంధీ ప్రధాని నివాసం వద్ద నిరసన చేపట్టగా, అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలకు నిరసనగా హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. టీపీసీసీ నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు, విద్యార్థి…

