ఎన్టీఆర్ విగ్రహావిష్కరణపై రాజకీయ రగడ.. కాంగ్రెస్-టీడీపీ జెండాలతో అమీర్‌పేట్‌లో హాట్ టాపిక్!
ఇవాళ హైదరాబాద్ రాజకీయ వాతావరణం మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అమీర్‌పేట్ మైత్రివనం చౌరస్తాలో ఆయన కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనుండటంతో రాజకీయంగా పెద్ద చర్చ మొదలైంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని కాంగ్రెస్ నాయకత్వం చెబుతుండగా, తెలంగాణవాదుల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 23 అడుగుల ఎత్తుతో ప్రత్యేకంగా…

