కాంగ్రెస్‌లో “రాగింగ్ రాజకీయం” — రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అంతర్గత కలహాల తుఫాన్!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం తీవ్రమైన అంతర్గత గందరగోళంలో పడిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. పార్టీ అంతర్గతంగా “సీనియర్స్ వర్సెస్ జూనియర్స్” రాగింగ్ వాతావరణం నెలకొన్నట్లు నేతల ప్రవర్తన చూస్తే స్పష్టమవుతోంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చే ఆదేశాలను మంత్రులు పట్టించుకోవడం లేదని, కొందరు సీనియర్ మంత్రులు ఆయనను జూనియర్‌గా తీసుకుంటున్నారని సమాచారం. కాలేజీల్లో రాగింగ్ జరిగితే కేసులు పెడతారు — కానీ కాంగ్రెస్‌లో మంత్రులు ఒకరిని ఒకరు రాగ్‌ చేస్తుంటే దానికి ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

రాజకీయ వర్గాల విశ్లేషణ ప్రకారం, రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న కీలక శాఖలు, ఆర్థిక వ్యవహారాలు ఆయన చేతుల్లోనే ఉండటంతో సీనియర్ నేతల్లో అసంతృప్తి పెరుగుతోంది. కొందరు మంత్రులు టెండర్లు, కమీషన్లు, లిక్కర్ డీల్స్ వంటి అంశాల్లో పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు

ఇక భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు వంటి సీనియర్ నేతల మధ్య కూడా సైలెంట్ పోటీ జరుగుతోందని సమాచారం. ముఖ్యమంత్రి సీటు త్వరలో మారబోతుందనే ఊహాగానాలు, కేబినెట్‌లో కమీషన్ ఆరోపణలు, బట్టి విక్రమార్క సతీమణి రోడ్ షోలు — ఇవన్నీ కలసి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతున్నాయి.

ఇక ప్రజల మధ్య కూడా ఈ అంతర్గత రగడ వల్ల ప్రభుత్వం స్థిరత్వంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్యకర్తలే నాయకత్వంపై అసంతృప్తి చూపుతుండడంతో రాబోయే పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్‌కు సవాలుగా మారబోతున్నాయి.

రాజకీయ విశ్లేషకుల మాటల్లో — ఇది కేవలం రేవంత్ రెడ్డి తప్పు కాదు, సీనియర్ నేతల అంతర్గత పోటీ, అధికారం పట్ల ఆకాంక్ష, మరియు సమన్వయం లోపం కలయికగా ఈ పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *