కొండా కుటుంబానికి వరుస షాక్‌లు.. సురేఖ వివరణపై పీసీసీ అసంతృప్తి? ఏఐసీసీకి చేరనున్న వివాదం
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మంత్రి కొండా సురేఖ కుటుంబాన్ని చుట్టుముట్టిన రాజకీయ వివాదం రోజురోజుకూ ముదురుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు మంత్రి కుమార్తె కొండా సుష్మిత పటేల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపగా, మరోవైపు ఆ వ్యాఖ్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదంటూ మంత్రి కొండా సురేఖ పార్టీ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో మంత్రి మాజీ ఓఎస్డీ…

