ఎనిమిది వారాల్లో చెల్లింపులు చేయాలని స్పష్టం
తెలంగాణలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల అంశంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 13న దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన కమిషన్, ఎనిమిది వారాల లోపు అర్హులైన రిటైర్డ్ ఉద్యోగులకు వారి బకాయిలను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు పిటిషనర్ తెలిపారు. అలాగే, మరణించిన ఉద్యోగులు, వారి కుటుంబాలు మరియు పిటిషన్ దారులకు పూర్తి వివరాలు తెలియజేయాలని కూడా ఆదేశించినట్లు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో ఫైనాన్స్ మంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై పిటిషనర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దాదాపు 20,500 మంది రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు ఇప్పటికే చెల్లించామని మంత్రి చెప్పిన మాటలు వాస్తవానికి విరుద్ధమని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా రిటైర్డ్ ఉద్యోగులు అసెంబ్లీని చుట్టుముట్టిన ఘటనను ఆయన గుర్తు చేశారు.
రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిల చెల్లింపుల్లో జాప్యం కారణంగా ఇప్పటివరకు పలువురు మరణించారని, ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించాల్సిన అంశమని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం కాలయాపన చేయకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలను అమలు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, ఉద్యోగ సంఘాల పాత్రపై కూడా ఆయన విమర్శలు చేశారు. ఉద్యోగుల హక్కుల కోసం పోరాడాల్సిన సంఘాలు నిష్క్రియంగా మారాయని ఆరోపించారు. అలాగే పోలీస్ కానిస్టేబుళ్ల ఆరోగ్య భద్రత పథకం పేరుతో నెలవారీగా డబ్బులు వసూలు చేస్తున్నప్పటికీ, సరైన వైద్య సేవలు అందడం లేదని పేర్కొన్నారు. ఈ అంశంపై డీజీపీకి ప్రత్యేకంగా వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు.
ప్రభుత్వం వెంటనే రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను వడ్డీతో సహా ఒకేసారి చెల్లించాలని, ఆరోగ్య భద్రత వంటి పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. ఎన్హెచ్ఆర్సీ ఇచ్చిన గడువు లోపల చర్యలు తీసుకోకపోతే న్యాయపరమైన పోరాటంతో పాటు

