ఉద్యోగులకు ఉచిత జీవిత బీమా.. అమలే అసలు సవాల్ అంటున్న ఉద్యోగ సంఘాలు

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు ఉచిత జీవిత బీమా పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ప్రమాదవశాత్తు ఉద్యోగి మరణిస్తే కుటుంబానికి రూ.1.20 కోట్ల వరకు బీమా రక్షణ కల్పించే ప్రతిపాదనపై ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ మేరకు ప్రముఖ బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నిర్ణయాన్ని ఉద్యోగ వర్గాలు స్వాగతిస్తున్నప్పటికీ, అమలుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య కార్డులు,…

Read More

తెలంగాణలో బదిలీల్లో విచిత్రాలు.. పై ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్‌కు ట్రాన్స్‌ఫర్‌లు!

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో కొన్ని శాఖలు, కొందరు అధికారులు నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ విచిత్ర నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పరిపాలనా సౌలభ్యం, ఉద్యోగుల సమర్థ వినియోగం కోసం చేపట్టిన బదిలీలను కొందరు అధికారులు కేవలం కాగితాలకే పరిమితం చేస్తూ అసలు ఉద్దేశాన్ని నీరుగారుస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ఇటీవల సుదీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయాలని నిర్ణయించింది. అయితే ఈ నిబంధనలోని లొసుగులను ఆసరాగా చేసుకుని కొందరు అధికారులు…

Read More

ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పనిదినాల పరిశీలన.. పెండింగ్ బిల్లులపై సర్కార్ హామీ

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పనిదినాల విధానాన్ని పరిశీలిస్తున్నట్లు సీఎస్ K. Ramakrishna Rao తెలిపారు. అలాగే జూన్ 2 నుంచి క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను 100 రోజులలోపు చెల్లించేలా ప్రయత్నాలు చేస్తున్నామని కూడా హామీ ఇచ్చారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలతో సీఎస్ చర్చించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ, టీఎన్జీవో,…

Read More

రిటైర్డ్ ఉద్యోగుల ఆవేదన.. “మా డబ్బులే ఇవ్వట్లేదు, ప్రభుత్వం చిట్‌ఫండ్‌లా వ్యవహరిస్తోంది”

తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సమస్య మరింత తీవ్రరూపం దాల్చుతోంది. రిటైర్మెంట్ అనంతరం నెలల తరబడి తమకు రావాల్సిన జీపీఎఫ్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, పీఆర్సీ అరియర్స్, గ్రాట్యుటీ తదితర బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయల సాధన కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవదాసు మాట్లాడుతూ, “నేను ఏప్రిల్ 2025లో రిటైర్ అయ్యాను. రిటైర్ అయ్యి ఏడాది పూర్తవుతోంది. జూన్‌లోనే అన్ని బిల్లులు…

Read More

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలపై ఆగ్రహం.. తెలంగాణలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ఉందంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత ఎనిమిది నెలలుగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, కమిటెడ్ ఎక్స్‌పెండిచర్, పెండింగ్ బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని పలువురు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సాధారణంగా ఉద్యోగి రిటైర్ అయ్యే నెల రోజుల ముందే అన్ని బకాయిలు సిద్ధం చేసి, రిటైర్మెంట్ అనంతరం చెల్లించాల్సి ఉంటుందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇటీవల రిటైర్డ్ ఆర్ఎస్ఐ భిక్షపతి మరణం ఈ…

Read More

ఈపీఎస్–95 పెన్షన్ న్యాయం కోసం పోరాటం: ఐదవ తేదీన 20,500 రిటైర్డ్ ఉద్యోగ కుటుంబాలతో రాజ్‌భవన్‌కు చలో

ఈపీఎస్–95 పెన్షన్ సమస్యలపై తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఖచ్చితంగా ఐదవ తారీకు రోజున 20,500 మంది రిటైర్డ్ ఉద్యోగులు తమ కుటుంబాలతో కలిసి హైదరాబాద్‌కు వచ్చి గవర్నర్ గారి వద్దకు వెళ్లనున్నట్లు ఉద్యమ నేతలు ప్రకటించారు. “చలో రాజ్‌భవన్” కార్యక్రమం ద్వారా తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేయాలని నిర్ణయించారు. ఈపీఎస్–95 కింద ఉన్న ఉద్యోగులు ప్రస్తుతం కేవలం రూ.1,000 పెన్షన్‌తోనే జీవనం సాగించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశానికి, ప్రభుత్వానికి…

Read More

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలపై ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు

ఎనిమిది వారాల్లో చెల్లింపులు చేయాలని స్పష్టం తెలంగాణలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల అంశంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 13న దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన కమిషన్, ఎనిమిది వారాల లోపు అర్హులైన రిటైర్డ్ ఉద్యోగులకు వారి బకాయిలను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు పిటిషనర్ తెలిపారు. అలాగే, మరణించిన ఉద్యోగులు, వారి కుటుంబాలు మరియు పిటిషన్ దారులకు పూర్తి వివరాలు తెలియజేయాలని కూడా ఆదేశించినట్లు వెల్లడించారు….

Read More