నిజం కోసం పోరాటం… ప్రజల గొంతుకగా ఓకే టీవీ ప్రస్థానం

నిజం కోసం, ప్రజల కోసం నిరంతరం పోరాడే మీడియా వేదికగా ఓకే టీవీ తన ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటోంది. “ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక” అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఈ ఛానల్, సామాన్యుల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

అన్యాయం, అవినీతి, అక్రమాలపై అక్షర యుద్ధం చేస్తూ, సత్యాన్ని నిర్భయంగా బయటపెట్టడమే ఓకే టీవీ లక్ష్యం. రాజ్యాంగాన్ని దైవంగా భావిస్తూ, ప్రజాహితాన్ని ప్రధానంగా తీసుకుని వార్తలను అందించడం ఈ మీడియా ప్రత్యేకతగా నిలుస్తోంది.

ఐదేళ్ల ప్రస్థానంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా వెనకడుగు వేయకుండా, ప్రజల మద్దతుతో ముందుకు సాగింది. సామాన్యుడి సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని, అధికార వ్యవస్థలపై ప్రశ్నలు లేవనెత్తుతూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తోంది.

ఓకే టీవీ ఇంటర్వ్యూలు, గ్రౌండ్ రిపోర్ట్స్ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నాయి. తప్పు చేసే వారిని నిలదీసే ధైర్యం, నిజాన్ని నిలబెట్టే నిబద్ధత ఈ ఛానల్‌కు ప్రత్యేక గుర్తింపునిస్తుంది.

“నిజం కోసం – జనం కోసం” అనే ధ్యేయంతో ముందుకు సాగుతున్న ఓకే టీవీ, భవిష్యత్తులో మరింత ప్రజలకు దగ్గరగా ఉండే మీడియా వేదికగా ఎదగాలని సంకల్పంతో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *