సురేందర్ రెడ్డి పై తప్పుడు ప్రచారం.. వాయిస్ రికార్డులతో మోసం చేశారని స్నేహితుల ఆరోపణ

సురేందర్ రెడ్డి పై జరుగుతున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధమని, వాటిని కావాలనే సృష్టించి ప్రచారం చేస్తున్నారని ఆయనకు 30 సంవత్సరాలుగా పరిచయం ఉన్న స్నేహితులు తెలిపారు. విజయ రెడ్డి కేసులో భాగంగా తమను తప్పుదారి పట్టించి, వాయిస్ రికార్డులను దుర్వినియోగం చేశారని వారు ఆరోపించారు.

స్నేహితుడు జంగయ్య మాట్లాడుతూ, “మేము 30 సంవత్సరాలుగా సురేందర్ రెడ్డితో కలిసి ఉన్నాం. ఆయన అలాంటి వ్యక్తి కాదు. కొంతమంది కావాలనే మమ్మల్ని ఫోన్ ద్వారా సంప్రదించి, సాధారణంగా మాట్లాడించిన విషయాలను రికార్డు చేసి, వాటిని తారుమారు చేసి యూట్యూబ్ ఛానళ్లలో ప్రచారం చేస్తున్నారు” అని తెలిపారు.

చిరంజీవి రెడ్డి అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా ఫోన్ చేసి, సురేందర్ రెడ్డి గురించి తప్పుడు సమాచారం తీసుకుని, వాటిని రికార్డు చేసి ప్రచారం చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. “మాకు చదువు లేకపోవడంతో, రికార్డింగ్ జరుగుతోందని కూడా తెలియదు. సాధారణంగా మాట్లాడిన మాటలను కట్ చేసి తప్పుగా చూపిస్తున్నారు” అని చెప్పారు.

విజయ రెడ్డి కుటుంబానికి డబ్బులు ఇచ్చిన విషయంపై కూడా తప్పుడు ప్రచారం జరుగుతోందని వారు తెలిపారు. “వాస్తవానికి సురేందర్ రెడ్డి దుబాయ్‌లో పనిచేస్తూ డబ్బులు పంపేవాడు. కానీ ఇప్పుడు ఆయన పేరును తప్పుగా ఉపయోగిస్తున్నారు” అని చెప్పారు.

ఇంకా, తాము ఫోన్ కాల్స్ ద్వారా ట్రాప్ అయ్యామని, బెదిరింపులకు గురయ్యామని పేర్కొన్నారు. “మమ్మల్ని భయపెట్టి అబద్ధపు మాటలు చెప్పించారు. ఆ తర్వాత వాటిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు” అని ఆరోపించారు.

ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజాలు బయటకు తేవాలని వారు డిమాండ్ చేశారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *