గ్లోబల్ సమ్మిట్ ప్రచారం – పెట్టుబడుల వాస్తవం ఏంటి? సమాధానాలు, సందేహాలు, విమర్శలు
తెలంగాణలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్‌పై భారీ చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలతో పాటు ఈ ఈవెంట్‌కి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే, దాని వెనుక ఉన్న అసలు లక్ష్యం, కార్యసాధ్యతపై ప్రశ్నలు లేవుతున్నాయి. ప్రభుత్వం చెబుతున్న సమాధానం ఏమిటంటే — అంతర్జాతీయ పెట్టుబడులను తెలంగాణలోకి రప్పించడానికి, భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు సృష్టించడానికి ఈ గ్లోబల్ సమ్మిట్ అవసరమని. మొదటి రోజే 35 కంపెనీలతో 2.43 లక్షల కోట్ల పెట్టుబడుల ఎంఓయూలు…

