రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఒక కీలక పిటిషన్‌ను సుప్రీం కోర్టు తీవ్రంగా తిరస్కరించింది. పిటిషన్‌కు కనీస అర్హత కూడా లేదని స్పష్టం చేస్తూ, విచారణకు కూడా స్వీకరించకుండా న్యాయస్థానం తిరస్కరించడం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద న్యాయపరమైన ఎదురుదెబ్బగా మారింది.
మెరిట్స్ ఆధారంగా వాదనలు వినిపించి తీర్పు ఇవ్వడం ఒక అంశమైతే, పిటిషన్‌ను మొదటిదశలోనే కొట్టివేయడం మరో అంశమని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కేసులో అయితే పిటిషన్‌ను విచారణకు కూడా అర్హత లేదని పేర్కొంటూ సుప్రీం కోర్టు స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని అంటున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం వాదనల్లో తీవ్ర బలహీనతను బయటపెట్టినట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ వ్యవహారంలో అడ్వకేట్లపై తప్పు మోపే అవకాశం లేదని న్యాయవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే న్యాయవాదులు క్లయింట్ సూచనల మేరకే వాదనలు వినిపిస్తారని, ప్రభుత్వం ఎంచుకున్న న్యాయ మార్గాన్నే కోర్టులో ప్రతిపాదించారని చెబుతున్నారు. పిటిషన్ రూపకల్పన నుంచే లోపాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఈ తరహా బలహీనమైన పిటిషన్ దాఖలు చేసిందా? లేక న్యాయపరమైన అవగాహన లోపంతో ఈ పరిస్థితి వచ్చిందా? అన్న అంశంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. కొందరు రాజకీయ విమర్శకులు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి సమయం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ తరహా పిటిషన్‌ను వ్యూహాత్మకంగా దాఖలు చేశారనే ఆరోపణలు చేస్తున్నారు.
ఏ కారణం ఏమైనా, సుప్రీం కోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వానికి ఇది తీవ్రమైన పరాభవంగా మారిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మెరిట్స్‌పై తీర్పు వస్తే వేరే అంశమని, కానీ అర్హతే లేదని చెప్పి పిటిషన్‌ను తిరస్కరించడం రాష్ట్ర ప్రభుత్వ న్యాయ వ్యూహంపై ప్రశ్నలు లేవనెత్తిందని అంటున్నారు.
ఈ పరిణామం తర్వాత ప్రభుత్వం తీసుకునే తదుపరి న్యాయపరమైన అడుగులు ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.

