News
రెవెన్యూ పేరుతో యూనివర్సిటీలను రియల్ ఎస్టేట్ హబ్‌లుగా మార్చే ప్రయత్నం: మౌలానా ఆజాద్ యూనివర్సిటీ విద్యార్థుల ఆగ్రహం
తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ జనరేషన్ పేరుతో విద్యాసంస్థల భూములపై కన్నేయడం తక్షణమే ఆపాలని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులు, పరిశోధకులు డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే క్యాంపస్ బయట చేయాలని, యూనివర్సిటీ భూములను తాకొద్దని ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు. ఇది కేవలం రొటీన్ సర్వే అంటూ టూరిజం మంత్రి చేసిన వ్యాఖ్యలను విద్యార్థులు ఖండించారు. ఇదే తరహా ప్యాటర్న్‌ను గతంలో బిజినెస్ స్కూల్స్, సెంట్రల్ యూనివర్సిటీల విషయంలో కూడా…
యూనివర్సిటీ భూములపై కాంగ్రెస్ కన్ను.. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా ప్రభుత్వ వ్యవహారం: కేటీఆర్ తీవ్ర విమర్శలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్‌ను తలపిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. విద్యాసంస్థలు, యూనివర్సిటీల అభివృద్ధి కంటే భూములు లాక్కోవడంపైనే ప్రభుత్వ దృష్టి ఉందని మండిపడ్డారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ భూములపై ప్రభుత్వం కన్నేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ రెండున్నరేళ్లలో మారిపోతుందని, ఆ తర్వాత కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి యూనివర్సిటీ విస్తరణకు కావాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వమే…
నిరుద్యోగుల అరెస్టులు కుట్ర కాదంటున్న కాంగ్రెస్.. ఉద్యోగాలపై చరణ్ కౌశిక్ క్లారిటీ
తెలంగాణలో నిరుద్యోగుల అంశం మరోసారి రాజకీయ వేడెక్కుతోంది. రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు రోడ్లెక్కి ఆందోళనలు చేపడుతుండగా, పోలీసులు అరెస్టులు చేస్తూ కట్టడి చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఓకే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ నేత చరణ్ కౌశిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడం ప్రతి ఒక్కరి హక్కేనని, అయితే ప్రభుత్వ లేదా ప్రైవేట్ కార్యక్రమాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితి ఏర్పడితే అరెస్టులు జరగడం సహజ ప్రక్రియేనని…
రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలపై ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు
ఎనిమిది వారాల్లో చెల్లింపులు చేయాలని స్పష్టం తెలంగాణలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల అంశంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 13న దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన కమిషన్, ఎనిమిది వారాల లోపు అర్హులైన రిటైర్డ్ ఉద్యోగులకు వారి బకాయిలను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు పిటిషనర్ తెలిపారు. అలాగే, మరణించిన ఉద్యోగులు, వారి కుటుంబాలు మరియు పిటిషన్ దారులకు పూర్తి వివరాలు తెలియజేయాలని కూడా ఆదేశించినట్లు వెల్లడించారు….
పాలకుర్తిలో కాంగ్రెస్‌కు అత్తా–కోడళ్ల బెడద..?
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, జాన్సీ రెడ్డిపై అసంతృప్తి నేతల ఫిర్యాదు పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆ పార్టీ అసంతృప్తి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త జాన్సీ రెడ్డి వ్యవహార శైలే ఇందుకు కారణమని ఆరోపిస్తూ, తక్షణమే పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారుల ఓటమికి ఇదే ప్రధాన కారణమని అసంతృప్తి వర్గం ఆరోపిస్తోంది….
రాజకీయాలకే పరిమితమవుతున్న పాలన.. మున్సిపల్ ఎన్నికలు, అంతర్జాతీయ పరిణామాలపై విమర్శలు
రాజకీయ నాయకులు ఎన్నికలపై పూర్తి దృష్టి పెట్టి పాలనను విస్మరిస్తున్నారని విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగంగా కొనసాగుతుండగా, ఓటర్ జాబితా సవరణకు మరో రెండు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. వార్డు వారీగా తుది ఓటర్ జాబితాను ఈ నెల 12న ప్రకటించనుండగా, 16న పోలింగ్ కేంద్రాల వారీ జాబితా విడుదల కానుంది. ఎన్నికలన్నింటినీ ఒకేసారి పూర్తి చేయాలనే తొందరలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దీనివల్ల పరిపాలనపై ప్రభావం పడుతోందని ప్రతిపక్షాలు…
ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల్ని తిప్పి పంపకూడదు – కఠిన రిఫరల్ సిస్టంపై సర్కార్ కసరత్తు
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన ఏ రోగినైనా ఇకపై “సౌకర్యాలు లేవు”, “కేసు సీరియస్” అనే కారణాలతో తిప్పి పంపేందుకు వీలు ఉండదని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేయనుంది. రోగి పరిస్థితి ఎలా ఉన్నా ఆసుపత్రి గడప తొక్కిన వెంటనే అడ్మిట్ చేయాల్సిందే అన్న నిబంధనను అమల్లోకి తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పటిష్టమైన రిఫరల్ సిస్టం అమలుపై అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసే అంశంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర…
ప్రశ్నించని ప్రజలే పాలకుల బలం..! తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎటు పోతుంది?
హాయ్ హలో అందరికీ నమస్తే…ఇది రాజకీయ విమర్శ కాదు – ఇది ఒక సాధారణ పౌరుడి ప్రశ్న. ఈరోజు మనం చూస్తున్న మీడియా, రాజకీయాలు, పాలన అన్నీ కలిపి చూస్తే ఒకే విషయం స్పష్టంగా అర్థమవుతుంది – ప్రజా సమస్యలు వార్తలే కావడం లేదు. ఎవరు ఎవరిని తిట్టారు, ఎవరు ఎవరిపై కామెంట్ చేశారు అన్నదే హెడ్‌లైన్. కానీ రోడ్లు, నిరుద్యోగం, జీతాలు, రైతుల సమస్యలు మాత్రం ఎక్కడా కనిపించడంలేదు. నాలుగో స్థంభం ఎవరికి పనిచేస్తోంది? నిష్పక్షపాతంగా…
అనగనగా ఒక రాజు ట్రైలర్.. పండగ వైబ్‌తో నవీన్ షో!
నవీన్ పొలిశెట్టి లీడ్ రోల్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మారి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా అనగనగా ఒక రాజు. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే టీజర్ ఇంకా సాంగ్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన అనగనగా ఒక రాజు సినిమా నుంచి లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అనగనగా ఒక రాజు ట్రైలర్ చూస్తే ఇది పక్కా పండగ వైబ్…
భాగ్యశ్రీ వా… వారెవా..! అఖిల్ ‘లెనిన్’లో పాటతోనే హింట్
ఆంధ్రా కింగ్ తాలూకా తర్వాత భాగ్య శ్రీ బోర్స్ చేస్తున్న సినిమా లెనిన్. అక్కినేని హీరో అఖిల్ హీరోగా చేస్తున్న ఈ సినిమాను మురళి కిషోర్ డైరెక్ట్ చేస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి తొలి సాంగ్ వా వారెవా రిలీజైంది. సాంగ్ ఇలా రిలీజ్ అయ్యిందో లేదో అలా ఇన్ స్టంట్ హింట్ అయ్యింది. ఈమధ్య వరుస సినిమాలతో థమన్ దూసుకెళ్తున్నాడు….

