News
కవిత కాంగ్రెస్‌లోకి వెళ్తే ఆశ్చర్యం లేదు..! మంత్రి పదవి రాకపోతే పార్టీకే నష్టం: మాల్రెడ్డి రంగారెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఆశ్చర్యం ఏమీ లేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. మంగళవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆమె భవిష్యత్ రాజకీయ ప్రయాణంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో స్పందించిన మాల్రెడ్డి రంగారెడ్డి.. “కడియం శ్రీహరి, దానం నాగేందర్ కాంగ్రెస్‌లోకి వస్తారని మేము అనుకున్నామా?…
బన్నీ బ్రాండ్.. స్టెప్ బై స్టెప్ ఎదగడమంటే ఇదేనేమో!
బన్నీ బ్రాండ్.. స్టెప్ బై స్టెప్ ఎదగడమంటే ఇదేనేమో!ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో అల్లు అర్జున్ పేరు ఇప్పుడు కేవలం నేమ్ కాదు.. ఒక బ్రాండ్ అనే చెప్పాలి. ఒకప్పుడు కేవలం తెలుగు ప్రేక్షకులకే పరిమితమైన తన స్టార్ ఇమేజ్ ను ఇంటర్నేషనల్ లెవెల్ కు పెంచుకున్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. స్టెప్ బై స్టెప్, బ్రిక్ బై బ్రిక్ తన కెరీర్ ను నిర్మించుకుంటూ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారారని చెప్పాలి….
అసెంబ్లీ బాయికాట్ వెనుక అసలు లాజిక్ ఏంటి? కవిత స్పీచ్, కేసీఆర్ స్ట్రాటజీపై విశ్లేషణ
అసెంబ్లీ బాయికాట్ వెనుక అసలు లాజిక్ ఏంటి? కవిత స్పీచ్, కేసీఆర్ స్ట్రాటజీపై రాజకీయ విశ్లేషణ తెలంగాణ రాజకీయాల్లో అసెంబ్లీ సమావేశాలు ఈసారి తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. దాదాపు వారం రోజులుగా కొనసాగుతున్న శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్ష పాత్ర, ముఖ్యంగా బీఆర్‌ఎస్ వైఖరి రాజకీయ వర్గాల్లోనే కాదు, ప్రజల్లోనూ అనేక ప్రశ్నలకు కారణమవుతోంది. అసెంబ్లీ సమావేశాలకు ముందు ప్రతిపక్ష నేత కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్‌లో “ఇక నుంచి ప్రజాక్షేత్రంలోనే పోరాటం చేస్తా” అనే వ్యాఖ్యలు…
అదే నిజమైన హీరోయిన్’.. అనసూయ కొత్త పోస్ట్ ఎవరికోసం?
‘అదే నిజమైన హీరోయిన్’.. అనసూయ కొత్త పోస్ట్ ఎవరికోసం?యాంకర్ అనసూయ.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతుంటారు. అదే సమయంలో పలు విషయాలపై కూడా రెస్పాండ్ అవుతుంటారు. రీసెంట్ గా నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ పై చేసిన వ్యాఖ్యలపై స్పందించి హాట్ టాపిక్ గా మారారు. అనేక మంది అనసూయకు మద్దతు తెలిపారు. కొందరు మాత్రం.. ఓ షో లో ఆమె చేసిన డబుల్ మీనింగ్ తో…
పైరసీ భూతంపై టాలీవుడ్ సంచలన నిర్ణయం.. కనీసం ఇప్పటికైనా?
పైరసీ భూతంపై టాలీవుడ్ సంచలన నిర్ణయం.. కనీసం ఇప్పటికైనా?పైరసీ.. టాలీవుడ్ సినీ పరిశ్రమకు అతిపెద్ద భూతంగా మారింది. సుమారుగా కొన్ని సంవత్సరాలలోనే వేలకోట్ల నష్టాన్ని మిగిల్చిన ఈ పైరసీ దుండగులు సినీ పరిశ్రమను పూర్తిస్థాయిలో నష్టాల్లో ముంచేస్తున్నారు అనడంలో సందేహం లేదు. అయితే ఈ పైరసీని అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కంకణం కట్టుకున్నా.. ఎప్పటికప్పుడు కొత్త పైరసీ యాప్ లు పుట్టుకొస్తూ అధికారులకు తలనొప్పిగా మారాయి. అయితే ఈ పైరసీ భూతాన్ని తరిమికొట్టడానికి టాలీవుడ్ సినీ…
హీరోల రెమ్యునరేషన్ల వెనుక అసలు లెక్కలివే.. బన్నీ వాసు షాకింగ్ క్లారిటీ
హీరోల రెమ్యునరేషన్ల వెనుక అసలు లెక్కలివే..సినిమా హీరోల రెమ్యునరేషన్లు చూసి అవాక్కవ్వడం కామన్. వందల కోట్లు తీసుకుంటున్నారని బయట రకరకాల డిస్కషన్లు జరుగుతుంటాయి. అయితే ఈ భారీ ఫిగర్స్ వెనుక ఉన్న అసలు వాస్తవాలు వేరని ప్రొడ్యూసర్ బన్నీ వాసు క్లారిటీ ఇచ్చారు. హీరోల సంపాదన, వారి మెయింటెనెన్స్ ఖర్చులు, చివరగా నిర్మాత నెత్తి మీద పడే భారం గురించి ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. స్టార్ హీరోలు ఒక్క సినిమాకు 200 కోట్లు తీసుకుంటున్నారనే టాక్…
ముఖ్యమంత్రి స్థాయిలో గన్‌మన్‌పై దాడి దారుణం – కాంగ్రెస్ నేతల తీరు తీవ్ర విమర్శలపాలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్‌మన్‌పై చేయి చేసుకున్న ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటని పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అధికారం చేతికి వచ్చాక ఆగ్రహం, అసహనం పెరిగి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా అనే ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యమంత్రి గన్‌మన్‌ను కొట్టడం ఏ రకమైన ఆనందమని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. గ్రామ స్థాయిలో ఓడిపోయిన సర్పంచులు ప్రత్యర్థులపై దాడులు చేస్తున్న పరిస్థితులకు, ముఖ్యమంత్రి ప్రవర్తనే ప్రేరణగా…
సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబాటు – మంత్రి స్పష్టం
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని సంబంధిత మంత్రి శాసనసభలో స్పష్టం చేశారు. సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానంగా మాట్లాడుతూ, హాస్పిటల్స్, నియామకాలు, రిటైర్డ్ ఉద్యోగుల సదుపాయాలు, భవిష్యత్తు కార్యాచరణపై కీలక ప్రకటనలు చేశారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విషయంలో ఇప్పటికే కార్డియాలజీ, ఆంకాలజీ వంటి విభాగాల్లో రిఫరల్ హాస్పిటల్స్‌ను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఖాళీగా ఉన్న హాస్పిటల్స్‌లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతపై స్పందిస్తూ, ప్రస్తుతం 11…
మున్సిపల్ ఎన్నికల వేళ పురోహితుడిపై దాడి ఆరోపణలు: ఎక్స్ సర్పంచ్ కుటుంబంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసి పోలింగ్ ముగిసే వరకు అందుబాటులో ఉండాలని స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయడంతో మున్సిపల్ ఎన్నికల నగారా మోగినట్టైంది. అయితే, గత సర్పంచ్ ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా హింస, బెదిరింపులు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు తీవ్ర ఆందోళనకు దారి తీస్తున్నాయి. ఇటీవల బాసర ప్రాంతానికి చెందిన ఓ పురోహితుడిపై దాడి జరిగిందని, తన కుటుంబం తీవ్ర భయాందోళనలో ఉందని బాధితుడు…
ఈవీ పాలసీతో తెలంగాణ రోల్ మోడల్: 100% టాక్స్ మినహాయింపు, 900 కోట్ల ఆదాయ నష్టం అయినా వెనక్కి తగ్గని ప్రభుత్వం
రాబోయే తరానికి కాలుష్య రహిత భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 41 ద్వారా ఈవీ (ఎలక్ట్రిక్ వాహన) పాలసీని తీసుకొచ్చిందని అసెంబ్లీలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పాలసీ అమలులోకి వచ్చిన తర్వాత కేవలం ఒక్క సంవత్సరంలోనే లక్షకు పైగా ఈవీ వాహనాలు అమ్ముడైనట్లు సభకు తెలియజేశారు. ఈవీ వాహనాల కొనుగోలుపై 100 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ టాక్స్ మినహాయింపులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రానికి సుమారు రూ.900 కోట్ల…

