News
వ్యక్తిగా వెళ్తున్నా.. శక్తిగా తిరిగొస్తా: బిఆర్ఎస్‌పై నిప్పులు చెరిగిన కవిత, కొత్త పార్టీ సంకేతాలు?
బిఆర్ఎస్ నుంచి ఘోరమైన అవమానాలు ఎదురయ్యాయని, అవినీతిపై ప్రశ్నించినందుకే తనపై కక్ష కట్టి పార్టీ నుంచి బయటకు పంపారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. బిఆర్ఎస్ తనను సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆ పార్టీ ద్వారా లభించిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం తెలంగాణ శాసన మండలి వేదికగా భావోద్వేగంగా మాట్లాడిన కవిత, “వ్యక్తిగానే ఈ సభ నుంచి వెళ్తున్నాను.. కానీ భవిష్యత్తులో ఒక శక్తిగా తప్పకుండా తిరిగి వస్తాను” అంటూ…
డ్రెస్సింగ్ స్వేచ్ఛా లేదా సంస్కారాలా? అనసూయపై తీవ్ర వ్యాఖ్యలు.. శివాజీ మాటల్లో భావం కరెక్టేనా?
సినిమా ఇండస్ట్రీలో డ్రెస్సింగ్ సెన్స్, స్వేచ్ఛ, సంప్రదాయాల అంశంపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన ఓ సామాజిక కార్యకర్త, మదర్ ఫౌండేషన్ చైర్మన్‌గా తన అభిప్రాయాన్ని గట్టిగా వ్యక్తం చేశారు. తాను పార్టీలకు అతీతంగా, ఒక తెలంగాణ ఆడబిడ్డగా మాట్లాడుతున్నానని పేర్కొన్న ఆమె, శివాజీ మాటల్లో భావం సరైందేనని స్పష్టం చేశారు. అయితే ఆయన మాట్లాడినప్పుడు…
అసెంబ్లీ బాయికాట్‌తో లాభం ఎవరికీ? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, పవర్ పాయింట్ రాజకీయంపై తీవ్ర విమర్శలు
ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పూర్తిగా ప్రశ్నించడం లేదని తాను అనట్లేదని, కానీ బీజేపీతో పోలిస్తే కాస్త మెరుగ్గానే ఉందని రాజకీయ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఇంకా ఎక్కువగా గ్రౌండ్‌లో తిరగాల్సిన అవసరం ఉందన్నారు. హరీష్ రావు, కేటీఆర్ వంటి నేతలు ప్రజల్లోకి వెళ్లి మరింత బలంగా ప్రశ్నించవచ్చని సూచించారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రోజు బీఆర్ఎస్ బాయికాట్ చేయడాన్ని ఆయన సమర్థించినా, ఆ తర్వాత కూడా అసెంబ్లీకి రాకపోవడమే పెద్ద తప్పు అని విమర్శించారు. ఒకరోజు నిరసన…
అసెంబ్లీలో ప్రశ్నించే హక్కే ప్రజాస్వామ్యానికి ప్రాణం: ప్రతిపక్షాల పాత్రపై కీలక వ్యాఖ్యలు
ప్రెస్ మీట్లలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఒక ఎత్తయితే, అసెంబ్లీలో అధికారికంగా ప్రశ్నించడం మరొక ఎత్తని వ్యాఖ్యానించారు ఓ రాజకీయ విశ్లేషకుడు. అసెంబ్లీలో ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు తప్పనిసరిగా ఉండాలని, బీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలకు ఈ హక్కు రాజ్యాంగబద్ధంగా ఉందని పేర్కొన్నారు. అసెంబ్లీ కార్యకలాపాలను యావత్ దేశం గమనిస్తుందని, అక్కడ పాస్ అయ్యే బిల్లులే చట్టాలుగా మారతాయని గుర్తు చేశారు. ప్రజలు తమ సమస్యలపై అసెంబ్లీలో తమ ఎమ్మెల్యేలు ఎలా మాట్లాడుతున్నారో చూస్తారని తెలిపారు. నిరుద్యోగులు, పెన్షన్…
డెకాయిట్ పని అయిపోవచ్చిందిగా! చివరి దశకు అడివి శేష్ మూవీ
టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో ఉన్న రెండు ముఖ్యమైన సినిమాలు డెకాయిట్ మరియు గూఢచారి 2. ఈ రెండింటిలో ముందుగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం డెకాయిట్. షానియల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ రొమాంటిక్ రివెంజ్ డ్రామాగా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన డెకాయిట్ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాలో అడివి శేష్…
అనసూయ వ్యాఖ్యలపై రాశి ఫైర్.. పేరు ఎత్తకుండా స్ట్రాంగ్ కౌంటర్
హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో తెలిసిందే. ఈ వివాదంలోకి సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ కూడా ఎంటర్ కావడంతో చర్చ మరింత ముదిరింది. కొందరు వీరికి మద్దతుగా నిలవగా, మరికొందరు గత వీడియోలు, క్లిప్పులు షేర్ చేస్తూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా అనసూయ ఓ కామెడీ షోలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పెద్ద దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో సీనియర్ నటి…
విశ్వంభరకు దూరంగా మెగా ఫ్యాన్స్? చిరంజీవి సినిమాపై ఎందుకింత లో బజ్!
మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అనిల్ మార్క్ కామెడీతో పాటు మెగా బాస్ నుంచి అభిమానులు ఆశించే మాస్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయని టాక్. పైగా విక్టరీ వెంకటేష్ స్పెషల్ క్యామియో చేయడంతో ఈ ప్రాజెక్ట్‌పై హైప్ మరింత పెరిగింది. అయితే సంక్రాంతికి వస్తున్న ఈ సినిమాకు మంచి బజ్ ఉండగా, చిరంజీవి నెక్స్ట్ మూవీ…
తమకంటే ముందే చెల్లెళ్లకు వివాహాలు చేసిన స్టార్ హీరోయిన్స్
సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా పెద్దవాళ్లు ముందుగా వివాహం చేసుకుని, చిన్నవాళ్ల పెళ్లి తర్వాత జరుగుతుందని మనం ఆలోచిస్తాం. కానీ కొంతమంది స్టార్ హీరోయిన్స్ మాత్రం ఈ సాంప్రదాయాన్ని మార్చి, తమకంటే ముందే తమ చెల్లెళ్లకు వివాహాలు చేసి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. సాయి పల్లవి: టాలీవుడ్‌లో లేడీ పవర్ స్టార్‌గా తన గుర్తింపు పొందిన సాయి పల్లవి, ప్రస్తుతం హిందీ భారీ బడ్జెట్ చిత్రం రామాయణలో నటిస్తోంది. అయితే సాయి పల్లవి తన చెల్లెలు పూజా కన్నన్ వివాహం…
డైరెక్టర్స్‌లో రాజమౌళి.. హీరోల్లో నాని..? సక్సెస్ ఫార్ములా ఒకటే!
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో ఎస్.ఎస్. రాజమౌళికి ప్రత్యేక స్థానం ఉంది. శాంతి నివాసం సీరియల్ నుంచి ఆర్.ఆర్.ఆర్ వరకు ఆయన చేసిన ప్రతి ప్రాజెక్ట్ ఓ బ్రాండ్‌లా మారింది. రాజమౌళి సినిమా అంటే రిజల్ట్‌పై ఎలాంటి సందేహం లేకుండా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లే స్థాయిని జక్కన్న సృష్టించారు. ఓటమి ఎరుగని దర్శకుడిగా ఆయన వేసిన ప్రతి అడుగు తెలుగు సినిమా గౌరవాన్ని పెంచింది. అదే తరహాలో హీరోల విభాగంలో నేడు న్యాచురల్…
టాలీవుడ్ స్టార్ల సైడ్ బిజినెస్‌లు.. సినిమాలతో పాటు కోట్ల లాభాల దందా
సినీ రంగంలో స్టార్‌డమ్ ఎంత వేగంగా మారుతుందో, భవిష్యత్తు భద్రత కోసం తెలివైన పెట్టుబడులు పెట్టడం కూడా అంతే అవసరం. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్న టాలీవుడ్ స్టార్లు సినిమాల్లో భారీ పారితోషికాలు అందుకోవడమే కాదు, వ్యాపార రంగాల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్, థియేటర్లు, స్టార్టప్‌లు, టెక్ రంగాల్లో కోట్ల పెట్టుబడులతో ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మారుతున్నారు. కింగ్ నాగార్జునవ్యాపారాల్లో దిట్టగా పేరొందిన నాగార్జున అక్కినేని సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌ను విజయవంతంగా…

