ఇట్లా మాత్రం లేదు ఆత్మభిమానం” అన్న మాటే ఈ ప్రభుత్వ విధానాలపై ప్రజల ఆవేదనకు ప్రతీకగా మారింది. ప్రజలు కష్టపడి కట్టే పన్నులే ప్రభుత్వానికి ఆదాయం. ఆ డబ్బు పరుల సొమ్ము కాదు – ప్రజల సొమ్ము, దాన్ని ప్రజలకే సేవల రూపంలో తిరిగి ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది.
సేవలు అంటే చేతిలో చీపురు కట్ట పట్టుకుని రోడ్లు ఊడమడమే కాదు. ప్రజలు కట్టే టాక్సులకు సరైన విలువ రావాలి. ఆసుపత్రుల్లో చికిత్స, పేదల పెళ్లిళ్లకు భరోసా, సంక్షేమ పథకాల అమలే అసలైన సేవలు. కానీ నేడు ఆ సేవలు కనిపించడం లేదన్న ఆవేదన అన్ని వర్గాల్లో ఉంది.
తులం బంగారం – మాటలకే పరిమితమా?
ఇటీవల కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న సీనియర్ నేత హనుమంతరావు స్వయంగా చెప్పిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తులం బంగారం ధర లక్ష 55 వేల రూపాయలు దాటింది, ఇంకా పెరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తులం బంగారం పథకం అమలు అసాధ్యంగా మారింది అని ఆయన వ్యాఖ్యానించారు. అంటే, ప్రభుత్వం ఇచ్చిన హామీలే ఇప్పుడు ప్రభుత్వ నేతలకే అసాధ్యంగా కనిపిస్తున్నాయన్న మాట.
పెళ్లిళ్లు వాయిదా… ప్రజలు అయోమయం
కళ్యాణలక్ష్మి, తులం బంగారం పథకాలపై స్పష్టత లేకపోవడంతో పేద కుటుంబాలు తీవ్రమైన గందరగోళంలో ఉన్నాయి.
“ఇప్పుడు పెళ్లి చేస్తే చెక్కు రాదేమో?
పెళ్లి చేసేసుకున్నాక ప్రభుత్వం మళ్లీ ప్రకటిస్తే తులం బంగారం మిస్ అవుతామేమో?”
అన్న భయంతో చాలా మంది పెళ్లిళ్లనే వాయిదా వేసుకుంటున్నారు.
ఇది ప్రభుత్వ వైఫల్యానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఒక పథకం ఉంటే స్పష్టంగా చెప్పాలి. లేదంటే లేదని నిజాయితీగా ప్రకటించాలి. కానీ ఇలా అటు మాట, ఇటు చర్య లేక ప్రజలను అయోమయంలో పెట్టడం అన్యాయం అని విమర్శలు వస్తున్నాయి.
చివరికి ప్రశ్న ఒక్కటే
ప్రజల సొమ్ముతో పాలన చేసే ప్రభుత్వానికి ఆత్మభిమానం, బాధ్యత, స్పష్టత ఉండాలి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మాటలకే పరిమితమైతే, ప్రజల నమ్మకం ఎలా నిలబడుతుంది?
కళ్యాణలక్ష్మి, తులం బంగారం వంటి పథకాలపై ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన నిర్ణయం తీసుకుని ప్రకటించాలి. లేదంటే ఈ అయోమయం మరింత పెరిగి, ప్రజల ఆవేదన రాజకీయ అసంతృప్తిగా మారడం ఖాయం.

