తెలంగాణలో పెరుగుతున్న కష్టాలు: ప్రజలు గోషపడుతుంటే, నేతలు కోతలు — అవినీతి, అవ్యవస్థపై ఘాటు విమర్శలు

తెలంగాణలో ప్రతి తరగతి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. శ్రమజీవులు, కార్మికులు, మేస్త్రీలు, ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రిషియన్లు, ఆటో–క్యాబ్ డ్రైవర్లు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు— ఎవరి బతుకులోనూ స్థిరత్వం కనిపించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూలీలకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమయానికి వేతనాలు రాకపోవడం పెద్ద భారంగా మారింది.

వ్యవసాయ రంగం పూర్తిగా నష్టాల్లో మునిగిపోగా, వరి–పత్తి కొనుగోలు సమస్యతో రైతులు తీవ్ర గోషలో ఉన్నారు. వరి తడిసిందని కొనకుండా, పత్తి కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆర్ధికంగా పూర్తిగా విసిగిపోయిన స్థితి.

ఇక మహిళలకు వాగ్దానం చేసిన పథకాలు కూడా అమలు కాలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. కళ్యాణలక్ష్మీ, బంగారం పథకం, ఒంటరి మహిళా పెన్షన్, చిన్నపాటి పరిశ్రమల ఏర్పాటు అనే హామీలు ఆచరణలో కనిపించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక ప్రభుత్వ శాఖల్లో అవినీతి, రెవెన్యూ శాఖలో భూభారతి వివాదాలు మరింత ఉదృతమయ్యాయి. ప్రస్తుత రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి కుటుంబం లబ్ధి పొందుతోందనే ఆరోపణలు ప్రజల్లో కోపం పెంచుతున్నాయి. పోలీస్ స్టేషన్లలోనూ దందాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయనే ఆరోపణలపై కమాండ్ కంట్రోల్ పరిధిలో వాయిస్‌తో కూడిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్లు వస్తున్నాయి.

ఎండోమెంట్ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను అప్రజాస్వామ్యంగా తొలగించడం, పురోహితులకు జీతాలు లేకుండా నియమాలు పెట్టడం, అదే సమయంలో కొంతమంది నేతల ఇళ్లలో మాత్రం పురోహితులను పిలిపించడం వంటి వ్యవహారాలు విమర్శలకు దారి తీస్తున్నాయి.

మంత్రులు, అధికారి వర్గం ఆస్తులు పెరుగుతుండగా, ప్రజలు మాత్రం రోజువారీ జీవనంలో అట్టడుగు స్థాయికి పడిపోతున్నారని విమర్శకులు అంటున్నారు. ముఖ్యంగా ఉపముఖ్యమంత్రి బట్టి విజయసరస్వతి గారి కుటుంబ ఆస్తుల పెరుగుదలపై ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో ప్రజల్లో అనేక ప్రశ్నలు తలెత్తాయి.

హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతుండగా, నగర మార్గాల ప్రణాళికలో నిర్లక్ష్యం స్పష్టమవుతోంది. ప్రభుత్వ శాఖలన్నింటిలోనూ నిర్లక్ష్యం, అవినీతి, అక్రమాలు, లాబీయింగ్, భూముల కబ్జాలు వంటి అంశాలు తెలంగాణ పరిపాలనను దెబ్బతీస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో ప్రజలు మేల్కొని, ఓటుకు డబ్బు తీసుకోకుండా రాజకీయ వ్యవస్థకు చెక్ పెట్టాల్సిన సమయం వచ్చిందని ఆవేదన వ్యక్తం అవుతోంది. ప్రజలు మారితేనే వ్యవస్థ మారుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *