టీజీ టెట్ ఫలితాలు నేడు.. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులపై రాష్ట్రవ్యాప్త ఆడిట్‌కు కమిటీ ఏర్పాటు

తెలంగాణలో విద్యార్థులు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకవైపు టీజీ టెట్ (TG TET) జూన్-2026 పరీక్షల ఫలితాలను నేడు మధ్యాహ్నం 2:30 గంటలకు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటించగా, మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వ్యవస్థపై సమగ్ర ఆడిట్ నిర్వహించేందుకు ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. నేడు టీజీ టెట్ ఫలితాలు జూన్ 16 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు 10…

Read Full News

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల జాప్యంపై సీఎం సీరియస్.. కానీ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు?

తెలంగాణలో కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపుపై మరోసారి తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, జూలై నెలలో వేలాది మంది ఉద్యోగులకు జీతాలు అందకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లు సమాచారం. ఇటీవల ఈ సమస్యపై ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో, కామెంట్ సెక్షన్లలో కూడా “మాకు ఇప్పటికీ జీతం రాలేదు”, “కుటుంబాన్ని…

Read Full News

దేవాదాయ శాఖలో అవినీతి ఆరోపణలు… అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై మంత్రి కొండా సురేఖను నిలదీసిన ప్రజా ప్రతినిధి

రాష్ట్ర దేవాదాయ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపులు, నియామకాలపై అవినీతి ఆరోపణలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొండా సురేఖ పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి వ్యక్తిగత కార్యక్రమాలకు దేవాదాయ శాఖకు చెందిన పురోహితులు హాజరవుతున్నప్పటికీ, ఇతర ప్రైవేట్ కార్యక్రమాలకు వెళ్లొద్దని నిబంధనలు విధించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. ఇటీవల దేవాదాయ శాఖలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను అకారణంగా తొలగించి, వారి స్థానాల్లో అర్హతలేని వ్యక్తులను నియమిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి….

Read Full News

అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆవేదన… నెలల తరబడి జీతాలు లేక 1900 మంది తీవ్ర ఇబ్బందులు

రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. నెలల తరబడి జీతాలు అందక దాదాపు 1900 మంది ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారీ ఖర్చులకు డబ్బులు లేక అప్పుల పాలవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్ పాఠశాలలు, మోడల్ స్కూల్లు, కస్తూర్బా విద్యాలయాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, ప్రభుత్వ కాలేజీల్లో ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగ స్థాయిని బట్టి నెలకు రూ.13,600 నుంచి రూ.20,000…

Read Full News

రెండేళ్ల పాలన విజయాలపై అసెంబ్లీ చర్చా? సీఎం రేవంత్ ఆలోచనలపై ప్రశ్నలు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ప్రభుత్వం సాధించిన విజయాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలనే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే “రెండేళ్ల పాలన విజయాలు” అన్న మాట వినగానే ప్రజల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండు సంవత్సరాల్లో నిజంగా ఏం సాధించారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫుట్‌బాల్ ఈవెంట్లు…

Read Full News

రెండేళ్ల పాలన విజయాలపై అసెంబ్లీ చర్చా? సీఎం రేవంత్ ఆలోచనలపై విమర్శలు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలనే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలను చర్చించాలన్న ఆలోచనపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రతిపాదనపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు సంవత్సరాల పాలనలో ప్రభుత్వం సాధించిన “విజయాలు” ఏంటన్న ప్రశ్నలు ప్రజల్లో నుంచి వస్తున్నాయి….

Read Full News

ఫైనాన్స్ శాఖలో విక్రమార్క వైఫల్యం? జీతాలు నిలిచిపోవడంతో రేవంత్ ఆగ్రహం

ఫైనాన్స్ శాఖపై సీఎం రేవంత్ ఆగ్రహం: అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు ఎక్కడ నిలిచిపోయాయి? తెలంగాణలో ఆర్థిక శాఖ పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆరు–ఏడు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఇంటెలిజెన్స్, ఉద్యోగ సంఘాలు నివేదించడంతో సీఎం ఆర్థిక శాఖపై చురుకులు పెట్టినట్టు సమాచారం. గతంలో గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని ఇచ్చిన ఆదేశాలను కూడా అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలతో…

Read Full News

తెలంగాణలో పెరుగుతున్న కష్టాలు: ప్రజలు గోషపడుతుంటే, నేతలు కోతలు — అవినీతి, అవ్యవస్థపై ఘాటు విమర్శలు

తెలంగాణలో ప్రతి తరగతి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. శ్రమజీవులు, కార్మికులు, మేస్త్రీలు, ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రిషియన్లు, ఆటో–క్యాబ్ డ్రైవర్లు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు— ఎవరి బతుకులోనూ స్థిరత్వం కనిపించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూలీలకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమయానికి వేతనాలు రాకపోవడం పెద్ద భారంగా మారింది. వ్యవసాయ రంగం పూర్తిగా నష్టాల్లో మునిగిపోగా, వరి–పత్తి కొనుగోలు సమస్యతో రైతులు తీవ్ర గోషలో ఉన్నారు. వరి తడిసిందని కొనకుండా, పత్తి కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు…

Read Full News

తెలంగాణలో లక్ష బోగస్ ఉద్యోగాలు గుర్తింపు – బీఆర్ఎస్ హయాంలో 18 వేల కోట్ల ప్రజాధనం వృథా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల్లో దాదాపు లక్షకు పైగా బోగస్ ఉద్యోగాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ఉద్యోగాల పేరుతో సుమారు 18,000 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయినట్లు ఆర్థిక శాఖ ప్రారంభ అంచనాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 4,93,820 మంది అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, తాత్కాలిక, పార్ట్ టైమ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో కేవలం 2,74,844 మంది మాత్రమే తమ పూర్తి వివరాలు సమర్పించారు, ఇంకా 2.18…

Read Full News