Headlines

కాంగ్రెస్‌లో నేతల అసంతృప్తి.. కొండా సురేఖ ఎపిసోడ్‌తో పార్టీకి కొత్త తలనొప్పి?

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తి మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలే పార్టీ వ్యవహారాలు, పదవులు, నిర్ణయాలపై బహిరంగంగా విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. రాజగోపాల్ రెడ్డి నుంచి జీవన్ రెడ్డి వరకు, తాజాగా కొండా సురేఖ వరకు నేతల అసంతృప్తి వివిధ సందర్భాల్లో బయటపడుతున్న నేపథ్యంలో పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో కొండా సురేఖ పదవి కోల్పోతారని, ఆమె కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు…

Read Full News

తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాగ్ గుర్తించిన గ్యాప్‌లు.. 2026లో పరిస్థితి మారిందా?

తెలంగాణ ప్రభుత్వ వైద్య వ్యవస్థలో సమస్యలు కొత్తవేమీ కావా? కోట్ల రూపాయలు ఖర్చు చేసి వైద్య పరికరాలు కొనుగోలు చేసినా అవి రోగులకు సేవలుగా ఎందుకు మారడం లేదు? ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అవసరమైన డయాగ్నస్టిక్ పరీక్షలు అందుతున్నాయా? ఫైర్ సేఫ్టీ, పారిశుద్ధ్యం, ఆంబులెన్స్ సేవలు, బెడ్ కెపాసిటీ, వైద్య సిబ్బంది కొరత వంటి సమస్యలు ఎంతవరకు పరిష్కారమయ్యాయి? ఇవి ఇప్పుడు 2026లో మళ్లీ పరిశీలించాల్సిన కీలక ప్రశ్నలు. ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. కాగ్ నివేదికలోని…

Read Full News

కొండా సురేఖపై వేటు తప్పదా? ఖర్గేను కలవనున్న భట్టి.. రేవంత్ వర్సెస్ కొండా వర్గంలో పెరుగుతున్న ఉత్కంఠ

తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇప్పటికే అధిష్టానానికి చేరిన నేపథ్యంలో.. ఈ అంశంపై తుది నిర్ణయం ఎప్పుడు వస్తుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలవనున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ కావడం, ఆ తర్వాత…

Read Full News

ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ ‘ఎల్లో కాంగ్రెస్’.. తెలంగాణలో ముదురుతున్న పంచాయతీ!

ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ ‘ఎల్లో కాంగ్రెస్’ పంచాయతీ మరింత ముదురుతున్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గంపై సీనియర్ కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా మురళి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా మీడియా కథనాలు, పార్టీ క్రమశిక్షణ కమిటీ వ్యవహారం, కొండా సురేఖపై వస్తున్న ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో జరిగిన భేటీ తర్వాత…

Read Full News

ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫీజు దోపిడీ.. నాలుగేళ్ల కోర్సుకు ఐదేళ్ల ఫీజు!

ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫీజు దోపిడీపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంబీబీఎస్ కోర్సు కాల పరిమితి నాలుగున్నర సంవత్సరాలు మాత్రమే ఉన్నప్పటికీ, కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు బి, సి కేటగిరీ విద్యార్థుల నుంచి ఐదేళ్లకు ఫీజు వసూలు చేస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అదనంగా వసూలు చేసిన ఫీజును తిరిగి చెల్లించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనల నేపథ్యంలో తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ నాలుగేళ్లకే ఫీజు వసూలు…

Read Full News

తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2026 పరిస్థితి ఏంటి? కొత్త భవనాలు పెరిగినా పేషెంట్ సర్వీస్ మెరుగైందా?

తెలంగాణలో ప్రభుత్వ వైద్య వ్యవస్థ 2026లో అసలు పరిస్థితి ఎలా ఉంది? కొత్త భవనాలు, కొత్త మెడికల్ కాలేజీలు, పెరుగుతున్న ఆరోగ్య బడ్జెట్, కొత్త పరికరాలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. సాధారణ పేద రోగికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందే ప్రక్రియ ఎంతవరకు సులభంగా మారింది? డాక్టర్లు, నర్సులు, మందులు, పరికరాలు, డయాగ్నోస్టిక్ సేవలు, అత్యవసర వైద్యం, పారిశుద్ధ్యం, ఫైర్ సేఫ్టీ వంటి అంశాల్లో పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణలో ప్రభుత్వ వైద్య వ్యవస్థ ఎంత…

Read Full News

విద్యార్థులు రోడ్లపై.. ప్రభుత్వం ఏం చేస్తోంది? తెలంగాణలో విద్యా వ్యవస్థపై తీవ్ర విమర్శలు

తెలంగాణలో ప్రస్తుతం విద్యా వ్యవస్థకు సంబంధించి ఒక్క సమస్య కాదు.. అనేక సమస్యలు ఒకేసారి తెరపైకి వస్తున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్థుల ఆందోళనలు..పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు..టీచర్ల కొరత..ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులపై ఫిర్యాదులు..గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు..ఉద్యోగాల కోసం నిరుద్యోగుల పోరాటాలు.. ఇలా చూస్తే తెలంగాణ విద్యా వ్యవస్థపై అసలు ప్రభుత్వం దృష్టి పెట్టిందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇదే సమయంలో విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉండటంతో.. ఇన్ని శాఖలను ఒకేసారి…

Read Full News

పాలిటెక్నిక్ విద్యార్థుల నుంచి స్కూళ్ల వరకు.. తెలంగాణలో ఏం జరుగుతోంది?

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం విద్య, వైద్యం, విద్యార్థుల సమస్యలు ప్రధాన చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు, విద్యా విధానాలపై వస్తున్న విమర్శలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులపై ప్రశ్నలు రాజకీయంగా వేడి పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు హేమ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విద్య, వైద్యం ప్రజల ప్రాథమిక హక్కులని, ఈ రెండు రంగాలపై ప్రభుత్వాలు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. “ప్రజల…

Read Full News

మహిళలకు ఫ్రీ బస్ జర్నీ.. దక్షిణాది రాజకీయాల్లో గేమ్‌చేంజర్‌గా మారిన పథకం!

దక్షిణాది రాజకీయాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఇప్పుడు ఒక కీలక సంక్షేమ పథకంగా మారింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం.. ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విస్తరించింది. తాజాగా తమిళనాడులోనూ మహిళలకు మరింత విస్తృతంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందించే నిర్ణయాలు చర్చకు వచ్చాయి. మహిళలకు ప్రయాణ ఖర్చు తగ్గించడం, ఉద్యోగాలు, విద్య, వ్యాపారం, ఇతర అవసరాల కోసం స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం కల్పించడం ఈ పథకం ప్రధాన…

Read Full News

శంకర్ దాదా MBBSలుగా నకిలీ వైద్యం.. హైదరాబాద్‌లో 12 మంది నకిలీ వైద్యుల అరెస్ట్!

హైదరాబాద్‌లో నకిలీ వైద్యుల వ్యవహారం మరోసారి కలకలం రేపింది. ఎలాంటి వైద్య అర్హతలు లేకుండానే డాక్టర్లుగా చెలామణి అవుతూ అమాయక ప్రజలకు వైద్యం చేస్తున్నారనే ఆరోపణలపై 12 మందిని సికింద్రాబాద్ జూబ్లీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. చిన్న చిన్న క్లినిక్‌లు నిర్వహిస్తూ ప్రజలకు వైద్యం చేస్తున్న వీరిలో కొందరు ఫార్మసిస్టులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రజలకు అత్యవసర సమయంలో వైద్యం అందించే పేరుతో సరైన అర్హతలు లేకుండా చికిత్స…

Read Full News