22A, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చ ఏదీ? సభలో మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నల వర్షం!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సభా కార్యక్రమాల నిర్వహణ, సభ్యుల సస్పెన్షన్‌, 22A భూములు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, విద్యుత్‌ సమస్యలపై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సభలో లేని సభ్యులను కూడా సస్పెండ్‌ చేయడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. సభా ఉల్లంఘన జరిగినప్పుడు దానిని ప్రశ్నించడం ప్రతిపక్ష సభ్యుల బాధ్యత అని పేర్కొన్న మహేశ్వర్‌రెడ్డి.. సభ్యుల సస్పెన్షన్‌ ఏ నిబంధనల ప్రకారం జరిగిందో స్పష్టం చేయాలని కోరారు. సభను నడిపించేందుకు కొత్త రూల్‌బుక్‌ ఏమైనా…

Read Full News

మల్లంపేట్‌ భూములపై మరో ట్విస్ట్.. 76 మంది ప్లాట్‌ ఓనర్ల సంచలన ఆరోపణలు!

హైదరాబాద్‌ పరిసరాల్లోని మల్లంపేట్‌–బొల్లారం ప్రాంతంలో భూముల వివాదం మరింత ముదురుతోంది. గతంలో చెరువులు, సర్వే నంబర్లు, ఆక్రమణలపై ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో.. తాజాగా తమ భూములు కూడా వివాదంలో చిక్కుకున్నాయని 76 మంది ప్లాట్‌ ఓనర్లు ఆరోపిస్తున్నారు. తమ వాదనలకు సంబంధించిన పత్రాలు, వివరాలతో వారు ఓకే టీవీని సంప్రదించారు. ప్లాట్‌ ఓనర్ల వివరాల ప్రకారం.. తాము బొల్లారం పరిధిలోని సర్వే నంబర్‌ 297లో భూములను కొనుగోలు చేశామని తెలిపారు. తమ ప్లాట్లు బొల్లారం సబ్‌స్టేషన్‌ పక్కనే…

Read Full News

22A భూములపై చర్చ ఎప్పుడు? మహేశ్వర్‌రెడ్డి పట్టుబాటు.. సభలో స్పీకర్‌ అంశంపై వాడీవేడి

దాదాపు ఆరు నెలల తర్వాత తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో 22A నిషేధిత భూముల అంశం సభలో మరోసారి చర్చకు వచ్చింది. 22A భూముల వ్యవహారంలో జరిగిన అక్రమాలు, భూదందాలపై ఆధారాలతో సహా వివరాలు బయటపెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. ప్రజలకు నేరుగా సంబంధించిన 22A భూముల అంశంపై పూర్తి స్థాయి చర్చ జరగాలని ఆయన కోరారు. ఈ అంశాన్ని షార్ట్‌ డిస్కషన్‌గా తీసుకుని, భూ నిర్వహణకు…

Read Full News

22A భూములపై చర్చ ఎప్పుడు? అసెంబ్లీలో మహేశ్వర్‌రెడ్డి డిమాండ్.. స్పీకర్‌ అంశంపై అధికారపక్షం కౌంటర్

తెలంగాణ అసెంబ్లీలో 22A నిషేధిత భూముల అంశంపై చర్చ జరపాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. దాదాపు ఆరు నెలల తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు సంబంధించిన కీలకమైన భూ సమస్యపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. 22A భూముల విషయంలో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించిన మహేశ్వర్‌రెడ్డి.. ఆధారాలతో సహా పలు అంశాలను సభ ముందుంచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ‘వేల కోట్ల…

Read Full News

అసెంబ్లీ గేటు రచ్చపై మరో వివాదం.. సబితా ఇంద్రారెడ్డిని లాగిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి?

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజు జరిగిన పరిణామాలు రెండో రోజుకూ రాజకీయ వేడిని కొనసాగిస్తున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై చేసినట్లు ఆరోపణలు వచ్చిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతుండగా.. మరోవైపు అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాతా మధుసూదన్, నవీన్ రెడ్డిలపై చర్యలు తీసుకోవడం సరైనదేనని, అయితే అదే సమయంలో మహిళా ప్రజాప్రతినిధుల…

Read Full News

అసెంబ్లీ గేటు వద్ద రచ్చ.. తాతా మధుసూదన్ వ్యాఖ్యలపై దుమారం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నల్ల దుస్తులు ధరించి నినాదాలు, ప్లకార్డులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ సభ్యులను పోలీసులు అడ్డుకోవడంతో అసెంబ్లీ గేటు వద్ద తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ పరిణామాల మధ్య బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు రాజకీయ దుమారం రేపాయి. స్పీకర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సభా గౌరవాన్ని దెబ్బతీశాయని కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం…

Read Full News

అసెంబ్లీ రచ్చపై తీవ్ర విమర్శలు.. ప్రజా సమస్యల కోసం సభకు రారా?

హైదరాబాద్: ప్రజా సమస్యలపై చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అసెంబ్లీ సమావేశాలు రాజకీయ రచ్చకు వేదికగా మారడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే ఆశతో ఎదురుచూస్తున్న సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసెంబ్లీ అనేది పార్టీ సమావేశం కాదని, ప్రజల తరఫున తమ వాణిని వినిపించాల్సిన అత్యంత కీలక వేదిక అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాధనంతో నిర్వహించే అసెంబ్లీ సమావేశాలకు సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని…

Read Full News

తెలంగాణకు పెట్టుబడులు రాకుండా కుట్రా? అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

తెలంగాణకు భారీగా విదేశీ పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో చేపట్టిన తన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు అమెరికా పర్యటనకు అనుమతి ఇచ్చి, తెలంగాణ ముఖ్యమంత్రిగా తన పర్యటనకు మాత్రం అనుమతి నిరాకరించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారం తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న రాజకీయ వివక్షకు నిదర్శనమని విమర్శించారు. లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న…

Read Full News

22A జాబితాపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. వివాదం లేని భూములకు విముక్తి? ఈ వారంలోనే కొత్త లిస్ట్!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భూములు, ఇళ్లు, ఫ్లాట్లు, ప్రైవేట్ ఆస్తులను నిషేధిత ఆస్తుల జాబితా 22Aలో చేర్చడంతో తలెత్తిన వివాదానికి త్వరలోనే పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు 22A జాబితాను సమీక్షించే ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే సవరించిన జాబితాను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. సీఎం ఆదేశాలతో 22A జాబితాపై కసరత్తు 22A నిషేధిత ఆస్తుల జాబితాలో వివాదం లేని…

Read Full News