అక్రమ సిమ్ విక్రయాల ముఠా బట్టబయలు: నాంపల్లిలో ఇద్దరి అరెస్ట్, 184 యాక్టివేటెడ్ సిమ్‌లు స్వాధీనం
హైదరాబాద్ నాంపల్లి పరిధిలో అక్రమంగా యాక్టివేటెడ్ సిమ్ కార్డులను విక్రయిస్తున్న ముఠాను సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి మొత్తం 184 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఎయిర్‌టెల్‌కు చెందిన 150 సిమ్‌లు, జియోకు చెందిన 34 సిమ్‌లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సీసీఎస్ డీసీపీ చైతన్య కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఏపీ రాష్ట్రం కడప జిల్లాకు చెందిన నేనావత్ దినేష్ కుమార్ నాయక్…

