ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీకి చెక్ పెట్టాలి.. అసెంబ్లీలో విజయశాంతి ఫైర్!
హైదరాబాద్లో వైరల్ ఫీవర్ బాధితుల నుంచి ప్రైవేట్ ఆస్పత్రులు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయంటూ అసెంబ్లీలో ఆందోళన వ్యక్తమైంది. సాధారణ జ్వరానికి కూడా వేల రూపాయల పరీక్షలు, వైద్య ఖర్చులు విధిస్తున్నారని ఎమ్మెల్యే విజయశాంతి ప్రత్యేక ప్రస్తావన ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సాధారణంగా జ్వరం, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న ప్రజలు సమీపంలోని చిన్న ఆస్పత్రులు, వైద్యులను సంప్రదిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. జ్వరం తగ్గకపోతే పెద్ద ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోందని, అక్కడ రక్త పరీక్షలు,…

