మహబూబ్‌నగర్ కాంగ్రెస్‌లో MUDA చైర్మన్ పదవిపై చర్చ.. మధుసూదన్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి వర్గాల్లో ఆసక్తి!

మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రస్తుతం MUDA చైర్మన్ పదవి చర్చనీయాంశంగా మారింది. మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) తదుపరి చైర్మన్‌గా ఎవరికి అవకాశం దక్కనుంది? దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తన అనుచరుడికి పదవి ఇప్పించగలరా? జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తన నియోజకవర్గానికి ప్రాధాన్యం కల్పించాలని కోరుతున్నారా? అనే ప్రశ్నలు జిల్లా రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇది కేవలం ఒక చైర్మన్ పదవికి సంబంధించిన వ్యవహారమేనా? లేక జిల్లాలోని కాంగ్రెస్…

Read Full News

22A భూములపై చర్చ ఎప్పుడు? మహేశ్వర్‌రెడ్డి పట్టుబాటు.. సభలో స్పీకర్‌ అంశంపై వాడీవేడి

దాదాపు ఆరు నెలల తర్వాత తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో 22A నిషేధిత భూముల అంశం సభలో మరోసారి చర్చకు వచ్చింది. 22A భూముల వ్యవహారంలో జరిగిన అక్రమాలు, భూదందాలపై ఆధారాలతో సహా వివరాలు బయటపెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. ప్రజలకు నేరుగా సంబంధించిన 22A భూముల అంశంపై పూర్తి స్థాయి చర్చ జరగాలని ఆయన కోరారు. ఈ అంశాన్ని షార్ట్‌ డిస్కషన్‌గా తీసుకుని, భూ నిర్వహణకు…

Read Full News

నాడు జీవన్ రెడ్డి.. నేడు చిన్నారెడ్డి! తెలంగాణ కాంగ్రెస్‌లో పాత–కొత్త పోరు ఎటు? అసంతృప్తి నేతలంతా ఒక్కటవుతున్నారా?

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో పాత–కొత్త నేతల మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. ఒకప్పుడు జగిత్యాల నియోజకవర్గంలో నెలకొన్న పాత–కొత్త నేతల వివాదంతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరిన విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు అదే జగిత్యాల నియోజకవర్గంలో మరోసారి అసంతృప్తి స్వరాలు వినిపిస్తుండటంతో కాంగ్రెస్‌లో అంతర్గత సమన్వయంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జీవన్ రెడ్డి తనకు పార్టీలో తగిన గుర్తింపు, పదవి లభించలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత కాంగ్రెస్‌కు…

Read Full News

నా సొంత ఊరే నన్ను ఓడించింది – జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. “నా సొంత ఊరు వాళ్లే నన్ను ఓడించి నా గుండెల మీద కొట్టినరు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తికి అద్దం పడుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనిరుద్ధ రెడ్డి మాట్లాడుతూ, బయట నుంచి వచ్చి తనను ఓడిస్తే అర్థం ఉండేదని, కానీ సొంత ఊరు పేరుతో కోటి 50 లక్షల రూపాయలు ఇచ్చినా…

Read Full News