బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు షాక్.. 20 మందికి పైగా సస్పెన్షన్! అసెంబ్లీలో తీర్మానం ఆమోదం
తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు పడింది. అసెంబ్లీ రూల్స్‌లోని రూల్ 340 సబ్‌రూల్ 2 కింద స్పీకర్ పేర్లు ప్రకటించిన సభ్యులను ప్రస్తుత సమావేశాల మిగిలిన కాలానికి సభా కార్యకలాపాల నుంచి సస్పెండ్ చేయాలని ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టిన అనంతరం స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. తీర్మానానికి అనుకూలంగా ఉన్న సభ్యులు “అయ్” అని చెప్పాలని, వ్యతిరేకంగా ఉన్నవారు “నో”…

