22A, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చ ఏదీ? సభలో మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నల వర్షం!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సభా కార్యక్రమాల నిర్వహణ, సభ్యుల సస్పెన్షన్, 22A భూములు, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యుత్ సమస్యలపై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సభలో లేని సభ్యులను కూడా సస్పెండ్ చేయడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. సభా ఉల్లంఘన జరిగినప్పుడు దానిని ప్రశ్నించడం ప్రతిపక్ష సభ్యుల బాధ్యత అని పేర్కొన్న మహేశ్వర్‌రెడ్డి.. సభ్యుల సస్పెన్షన్ ఏ నిబంధనల ప్రకారం జరిగిందో స్పష్టం చేయాలని కోరారు. సభను నడిపించేందుకు కొత్త రూల్‌బుక్ ఏమైనా…

