బోరబండ బస్తీలో ప్రజల గోడు.. డ్రైనేజీ, చెత్త, నీటి ముంపుతో నరకయాతన.. అధికారులపై స్థానికుల ఆగ్రహం
హైదరాబాద్, బోరబండ:“ఎన్నికల సమయంలో అందరూ వస్తారు.. హామీలు ఇస్తారు.. గెలిచాక మాత్రం ఎవరూ కనిపించరు” అంటూ బోరబండ బస్తీ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడితే ఇళ్లలోకి నీరు చేరడం, డ్రైనేజీలు పొంగిపొర్లడం, చెత్త పేరుకుపోవడం, దోమలు పెరిగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు తెలిపారు. ఓకే టీవీ బృందం బోరబండ డివిజన్‌లోని పలు బస్తీలను సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకుంది. అక్కడి పరిస్థితులు పరిశీలించగా అనేక ప్రాంతాల్లో డ్రైనేజీలు బ్లాక్ కావడం, రోడ్లపై…

