బహదూర్‌గూడ రైతులకు హైకోర్టు ఊరట.. భూముల్లో జోక్యం వద్దని ప్రభుత్వానికి ఆదేశాలు
బహదూర్‌గూడ రైతులకు హైకోర్టు మధ్యంతర ఊరట.. భూముల్లో జోక్యం వద్దని ప్రభుత్వానికి ఆదేశాలు హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడలోని వివాదాస్పద భూముల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు నలుగురు రైతులకు మధ్యంతర ఊరట కల్పించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సంబంధిత భూముల్లో ఎలాంటి జోక్యం చేసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే సమయంలో హైడ్రా అధికారుల తీరుపై కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని…

