బీఆర్ఎస్కు మల్లారెడ్డి ఫ్యామిలీ గుడ్‌బై? శ్రావణంలో బీజేపీలో చేరికపై జోరుగా ప్రచారం
తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఆయన కుటుంబం త్వరలోనే బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరబోతుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున బీజేపీలో చేరికలు ఉంటాయని పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మల్లారెడ్డి కుటుంబం కూడా కమలం గూటికి చేరుతుందనే ఊహాగానాలు మరింత బలపడ్డాయి. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం…

