కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ కమిటీ నివేదిక.. ఇక నిర్ణయం ఏఐసీసీ చేతిలో!

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, నేతల వ్యాఖ్యల వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డిపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమగ్ర నివేదికను సిద్ధం చేసి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు అందించింది. కమిటీ చైర్మన్ మల్లు రవి, వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ కలిసి ఈ నివేదికను సమర్పించారు. ఇటీవలి పరిణామాల్లో పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేలా వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఇద్దరు…

Read Full News

కొండా సురేఖపై కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యలు? నివేదిక సిద్ధం.. మంత్రి పదవిపై ఉత్కంఠ

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి వ్యవహారం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేలా బహిరంగ వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదులపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ విచారణ పూర్తి చేసి నివేదిక సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నివేదికను క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు అందజేసినట్లు సమాచారం. అలాగే…

Read Full News

నాడు జీవన్ రెడ్డి.. నేడు చిన్నారెడ్డి! తెలంగాణ కాంగ్రెస్‌లో పాత–కొత్త పోరు ఎటు? అసంతృప్తి నేతలంతా ఒక్కటవుతున్నారా?

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో పాత–కొత్త నేతల మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. ఒకప్పుడు జగిత్యాల నియోజకవర్గంలో నెలకొన్న పాత–కొత్త నేతల వివాదంతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరిన విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు అదే జగిత్యాల నియోజకవర్గంలో మరోసారి అసంతృప్తి స్వరాలు వినిపిస్తుండటంతో కాంగ్రెస్‌లో అంతర్గత సమన్వయంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జీవన్ రెడ్డి తనకు పార్టీలో తగిన గుర్తింపు, పదవి లభించలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత కాంగ్రెస్‌కు…

Read Full News