మోయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు.. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి హైకోర్టు బెయిల్
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మోయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ తాండూరు మాజీ ఎమ్మెల్యే పంజుగుల రోహిత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మార్చి 14న అరెస్టైన రోహిత్ రెడ్డి గత 45 రోజులుగా చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో రోహిత్ రెడ్డి తరఫు న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం మంగళవారం బెయిల్ మంజూరు చేసింది….

