కేసీఆర్ ప్రెస్ మీట్‌పై కాంగ్రెస్ ఫైర్.. 10 ఏళ్ల పాలనలో ఒక్క అభివృద్ధి చూపించండి: చెన్నగాని దయాకర్

ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు సంవత్సరాల విరామం తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఓకే టీవీకి ఇచ్చిన ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో టీపీసీసీ అధికార ప్రతినిధి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెన్నగాని దయాకర్ కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రెస్ మీట్ పూర్తిగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలకే పరిమితమైందని, కానీ తన పదేళ్ల పాలనలో తెలంగాణకు చేసిన ఒక్క…

Read Full News

రోడ్డు మీద కాదు.. అసెంబ్లీలో చర్చిద్దాం: కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌

తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రోడ్డు మీద విమర్శలు కాదు, అసెంబ్లీ వేదికగా చర్చకు రావాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో జరిగిన తేనేటి విందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం, కృష్ణా గోదావరి జలాల అంశంపై సభలో చర్చకు సిద్ధమా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. కృష్ణా…

Read Full News

కాంగ్రెస్‌లో అంతర్గత అగ్నిపరీక్ష: మంత్రుల అహంకారంపై సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు, సీఎం రేవంత్ రెడ్డికి తలనొప్పి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు మరోసారి బహిరంగ చర్చకు వచ్చాయి. ఇటీవల జరిగిన ప్రెస్ మీట్‌లో బయటపడ్డ అంశాలు పార్టీని తీవ్ర అసౌకర్యంలోకి నెట్టాయి. మంత్రులను కలవడానికి వెళ్తే అవహేళనగా మాట్లాడుతున్నారని, గంటల తరబడి వేచిచూసేలా చేస్తున్నారని, నియోజకవర్గ సమస్యలపై స్పందన లేదని సొంత పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది విపక్షాల విమర్శ కంటే కూడా ప్రమాదకరమైన పరిణామంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సాధారణంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మంత్రులపై అసహనం వ్యక్తం…

Read Full News

పంచాయతీ ఎన్నికల ఫలితాలే 2029 అసెంబ్లీ ఎన్నికలకు నాంది: సీఎం రేవంత్ రెడ్డి

2029లో కూడా ఇదే రీతిలో ఫలితాలు పునరావృతం అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ విజయాన్ని అందించిన ప్రజలకు, అలాగే కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,702 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా, అందులో 7,527 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు, 808 పంచాయతీల్లో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థులు విజయం సాధించారని సీఎం వెల్లడించారు. రెబెల్స్‌తో కలిపి మొత్తం 8,335 పంచాయతీల్లో కాంగ్రెస్…

Read Full News

పార్టీ ఫిరాయింపుల చట్టానికి గండి: స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పుతో కాంగ్రెస్ తెచ్చిన చట్టమే నిర్వీర్యం?

తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈరోజు ఇచ్చిన తీర్పు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ తీర్పుతో పార్టీ ఫిరాయింపుల చట్టం (రాజ్యాంగం – 10వ షెడ్యూల్) ఉద్దేశ్యమే దెబ్బతిన్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చట్టాన్ని దేశంలో అమలు చేసినది అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ. రాజకీయాల్లో అక్రమ ఫిరాయింపులను అడ్డుకోవడం, ప్రజల ఓటుకు గౌరవం కల్పించడమే దీని లక్ష్యం. కానీ నేడు అదే చట్టాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్…

Read Full News

సత్యానికి–అసత్యానికి మధ్య పోరాటం: ఓట్ చోరీపై కాంగ్రెస్ మెగా ర్యాలీ, ఈసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

దేశంలో సత్యానికి–అసత్యానికి మధ్య పోరాటం నడుస్తోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస మార్గంలోనే పోరాడి నరేంద్ర మోదీ–ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ డీఎన్‌ఏలోనే ఓట్ చోరీ ఉందని, కాంగ్రెస్ డీఎన్‌ఏలో మాత్రం సత్యం, అహింస ఉన్నాయని రాహుల్ గాంధీ అన్నారు. ఆదివారం న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఓట్ చోరీ – గద్దీ చోడ్”…

Read Full News

త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?: పొన్నం, కొండా సురేఖ తొలగింపు వార్తలపై మహేష్ గౌడ్ స్పష్టీకరణ

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందనే ప్రచారం నేపథ్యంలో, మంత్రి పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలను మంత్రివర్గం నుంచి తొలగిస్తారనే వార్తలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నేతలని ఆయన కితాబు ఇచ్చారు. అయితే శాఖల మార్పులు లేదా మంత్రివర్గంలో ఇతర మార్పులు ఉంటాయా అనే అంశంపై…

Read Full News

గ్రామ పంచాయతీ ఎన్నికలు: తొలి విడత ఫలితాలతో అలర్ట్ అయిన కాంగ్రెస్, రెండో విడతపై ఫోకస్ – బిఆర్ఎస్ కౌంటర్ వ్యూహాలు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ ముగియడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మొదటి విడత ఫలితాల్లో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు మెజారిటీ గ్రామాల్లో సర్పంచ్ స్థానాలు దక్కించుకున్నప్పటికీ, బిఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఎదురుకావడంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. తొలి విడతలో కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ స్వగ్రామాల్లోనే సర్పంచ్ స్థానాలను గెలిపించుకోలేకపోవడం పార్టీకి హెచ్చరికగా మారింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం వెంటనే రంగంలోకి దిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలు, పార్టీ…

Read Full News

బీసీ హక్కుల కోసం ఎలికట్ట విజయ్ కుమార్ గౌడ్ ఘాటైన విమర్శలు: ప్రజాస్వామ్యానికి తూట్లు పడుతున్నట్లు ఆరోపణ

బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కండక్టర్ ఎలికట్ట విజయ్ కుమార్ గౌడ్ రాష్ట్ర పరిపాలన, బీసీల హక్కుల విషయంలో తీవ్ర విమర్శలు చేశారు. ఆయన చెప్పినవారిగా, ఈ రాష్ట్రంలో రాజ్యాంగ పరిపాలన కొనసాగడం లేదని, రెండు కులాల ఏకాధిపత్యం రాజరికాన్ని పోలి నడుస్తోందని వ్యాఖ్యానించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని గౌరవించకుండా, ప్రజాస్వామ్యానికి తూట్లు పడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల చేతే ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు రాజ్యాంగంపై ప్రమాణం చేసి, ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యతను విస్మరించారని…

Read Full News

బీసీ రిజర్వేషన్ల హామీ తప్పించిన కాంగ్రెస్ పాలన కారణంగానే సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య: ఉద్యమ నాయకుల ఆగ్రహం

తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై వివాదం మళ్లీ తీవ్రమైంది. రెండు సంవత్సరాలుగా 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడంతోనే బీసీ యువకుడు సాయి ఈశ్వరాచారి ఆత్మహత్యకు పాల్పడ్డాడని బీసీ సంఘాలు, ఉద్యమ నేతలు ఆరోపిస్తున్నారు. ఉద్యమ నాయకులు మాట్లాడుతూ, “మాజీ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించాడు. ఈరోజు బీసీల హక్కుల కోసం మరోసారి సాయి ఈశ్వరాచారి బలి కావడం దురదృష్టకరం, దారుణం” అని వ్యాఖ్యానించారు. వారి ఆరోపణలు…

Read Full News