హంగ్ మున్సిపాలిటీల్లో హైడ్రామా… దాడులు, లాటరీలు, పొత్తులు మధ్య కాంగ్రెస్ హవా
తెలంగాణ మున్సిపల్ రాజకీయాలు ఉద్రిక్తతలు, హైడ్రామా, రాజకీయ పొత్తులతో ఉత్కంఠభరితంగా మారాయి. హంగ్ మున్సిపాలిటీల్లో ఇరు పార్టీల మధ్య ఘర్షణలు, రాళ్ల దాడులు, నిరసనలు చోటుచేసుకోవడంతో ఎన్నికల ప్రక్రియ ఉద్రిక్తంగా సాగింది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడిన కొన్ని మున్సిపాలిటీల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించగా, వాటిలో ఎక్కువ స్థానాలు అధికార కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఆధీనంలోని మున్సిపాలిటీల సంఖ్య 90కి పైగా చేరింది. మరోవైపు ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి…

