ఎర్రగడ్డలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు.. ప్రజల ఆగ్రహం: ఎన్నికల వేళ మళ్లీ హామీలేనా?
హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ప్రాంతంలో స్థానిక సమస్యలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా రోడ్లు, డ్రైనేజీ, నీటి నిల్వలు, పార్కింగ్ వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో నాయకులు, ప్రజాప్రతినిధులు బస్తీల్లో తిరిగి హామీలు ఇస్తున్నారని, ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వస్తే రోడ్లన్నీ జలమయం ఎర్రగడ్డ ప్రాంతంలోని కొన్ని బస్తీల్లో…

