కేంద్రం కొన్నంతే ధాన్యం కొనుగోలు.. రైతుల్లో ఆందోళన రేపుతున్న సర్కార్ నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఎంత మేర ధాన్యం, ఇతర పంటలను కొనుగోలు చేస్తే అంత మేరకే రాష్ట్రం కూడా రైతుల నుంచి సేకరణ చేపడుతుందని ప్రకటించడం రైతుల్లో ఆందోళనకు దారితీస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఇన్ఫార్మల్ క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు వెల్లడించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం నిర్దేశించిన విధి విధానాల ప్రకారం పంటల కొనుగోళ్లు…

Read More

10 రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి చేస్తాం.. రైతులకు క్షమాపణ చెప్పిన మంత్రి

రాష్ట్రంలో ధాన్యం సేకరణ ఆలస్యం కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ప్రభుత్వం తరఫున మంత్రి క్షమాపణ చెప్పారు. ఈసారి అంచనాలకు మించి ధాన్యం రావడంతో సమస్యలు తలెత్తాయని, రైతులు గత 15 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. ప్రభుత్వం రైతుల కోసం ఎప్పుడూ కట్టుబడి పనిచేస్తుందని, రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు. రాబోయే 10 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు….

Read More

80% ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయంటే ఏ శిక్షకైనా సిద్ధం”.. సీఎం వ్యాఖ్యలకు కేటీఆర్ సవాల్

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల అంశం మరోసారి రాజకీయ దుమారానికి దారితీసింది. రాష్ట్రంలో 80 శాతం పంట కొనుగోళ్లు పూర్తయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. నిజంగానే 80 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని నిరూపిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్, రాష్ట్రవ్యాప్తంగా రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్న పరిస్థితిలో ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు. “80…

Read More

మక్కలు తడుస్తున్నాయి.. లారీలు రావట్లేదు”.. రైతుల ఆవేదనపై మండిపడుతున్న గ్రామాలు

తెలంగాణలో మక్క రైతుల పరిస్థితి దయనీయంగా మారిందంటూ పలు గ్రామాల్లో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కోసి మార్కెట్‌కు తీసుకొచ్చినా లారీలు రావడం లేదని, ట్రాక్టర్లు తిరగడం లేదని, వర్షాల కారణంగా మక్కలు తడిసి నష్టపోతున్నాయని రైతులు వాపోతున్నారు. “ట్రాక్టర్ దొరకడం లేదు.. లారీలు రావట్లేదు.. రోజూ బస్తాలు తిప్పడమే మా పని అయిపోయింది” అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డుల్లో రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని, పంట అమ్మకానికి…

Read More

మక్కల బంగారం మాకే భారమైంది”.. రైతుల ఆవేదనలో రేవంత్ పాలనపై తీవ్ర విమర్శలు

తెలంగాణలో మక్క రైతుల ఆవేదన రోజురోజుకూ మరింత తీవ్రమవుతోంది. పంట చేతికొచ్చినా కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు, మార్కెట్ యార్డుల్లో నిల్వ సమస్యలు, లారీల కొరత, కొనుగోలు ఆలస్యం కారణంగా తమ పరిస్థితి దయనీయంగా మారిందని రైతులు ఆరోపిస్తున్నారు. “ట్రాక్టర్లు దొరకడం లేదు.. లారీలు రావడం లేదు.. బస్తాలు మోసుకుంటూ తిరగడమే మా పని అయిపోయింది” అంటూ రైతులు మండిపడ్డారు. పంటను మార్కెట్‌కు తీసుకెళ్లినా…

Read More

రైతు గోడు వినిపించడంలేదా? మక్క రైతుల ఆవేదనపై మండిపడ్డ గ్రామీణ తెలంగాణ

తెలంగాణలో రైతుల పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతోందంటూ మక్క రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డుల్లో పంట కొనుగోళ్లు నిలిచిపోవడం, గోదాముల వద్ద కిలోమీటర్ల మేర లారీలు, ట్రాక్టర్ల క్యూలు కనిపించడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. “ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నామని చెబుతోంది కానీ వాస్తవంగా పంట దిగుమతి చేయడం లేదు” అంటూ రైతులు మండిపడుతున్నారు. నాలుగు ఎకరాల్లో మక్క వేసిన రైతు జీవన్ మాట్లాడుతూ, “రోడ్డు మీదే పంట ఉంది, మార్కెట్‌లో అలాగే ఉంది,…

Read More

లారీలు పంపించండి.. పంట మొత్తం తడిసిపోతోంది” మార్కెట్ యార్డుల్లో రైతుల ఆవేదన

తెలంగాణలో రైతుల సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. పంటలను మార్కెట్ యార్డులకు తీసుకొచ్చి రెండు నెలలు గడిచినా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వర్షాలు ప్రారంభం కావడంతో మార్కెట్ యార్డుల్లో నిల్వ ఉంచిన ధాన్యం, జొన్నలు, ఇతర పంటలు తడిసి నష్టపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “జొన్నలు తీసుకొచ్చి రెండు నెలలు అవుతోంది. ఇప్పటికీ ఒక్క లారీ కూడా రాలేదు. పంట మొత్తం తడిసి పోతోంది” అంటూ రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు….

Read More

రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది: కొనుగోలు కేంద్రాల వద్ద బీఆర్ఎస్ ఆందోళన

రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆరోపిస్తూ భారత రాష్ట్ర సమితి నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన బీఆర్ఎస్ నాయకులు రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు సకాలంలో ఇవ్వలేదని, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిందని ఆరోపించారు. వరి, మొక్కజొన్న, తెల్లజొన్న, శనిగలు వంటి పంటల…

Read More