తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తి?.. ఎమ్మెల్యేల ఫీడ్‌బ్యాక్‌పై రాజకీయ చర్చ
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, పార్టీ వ్యవహార శైలి, ముఖ్యమంత్రి నాయకత్వంపై కాంగ్రెస్ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ అధిష్ఠానం నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న ఫీడ్‌బ్యాక్ ప్రక్రియలో పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు ప్రభుత్వ పనితీరుపై తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తెలియజేసినట్లు సమాచారం. అయితే ఈ ఫీడ్‌బ్యాక్‌కు సంబంధించిన అధికారిక నివేదికను కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు విడుదల చేయలేదు. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం, ఆల్ ఇండియా…

