నాగర్కర్నూల్ కుమ్మరి గ్రామం విషాదం – పాప మృతి కేసులో న్యాయం కోసం ప్రజల ఆవేదన
నాగర్కర్నూల్ జిల్లా పరిధిలోని కుమ్మరి గ్రామంలో జరిగిన విషాద ఘటనపై ఇంకా న్యాయం జరగలేదని స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి మృతి ఘటనపై పోలీసులు సరైన దర్యాప్తు చేయలేదని, కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో పోలీసుల ప్రకటనలు వివాదాస్పదంగా మారాయి. డిఎస్పీ మీడియాతో మాట్లాడుతూ సంఘటన సమయంలో చిన్నారి అక్కడ లేదని, ఘర్షణ వల్ల ఎలాంటి గాయాలు జరగలేదని, మృతికి స్పష్టమైన కారణం తెలియలేదని…

