మీనాక్షి నటరాజన్‌కు వెన్నుపోటు పొడిచింది ఎవరు? రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వెనుక కాంగ్రెస్‌లోనే కుట్రా?
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతోంది. అయితే ఈ వ్యవహారంలో అసలు ట్విస్ట్ ఏమిటంటే… బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీలోనే ఆమెకు వెన్నుపోటు పొడిచారని ప్రచారం జోరుగా సాగుతోంది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు కారణంగా ఆమె అఫిడవిట్‌లో కొన్ని కేసుల వివరాలు పొందుపరచలేదని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశాన్ని బీజేపీ ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, చివరకు ఆమె నామినేషన్ తిరస్కరణకు…

