ప్రభుత్వ ఉద్యోగులకు డిజిటల్ సర్వీస్ బుక్.. సెలవులు, లోన్లు, ఇంక్రిమెంట్లలో పూర్తి పారదర్శకత
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రికార్డుల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఫిజికల్ రూపంలో నిర్వహిస్తున్న సర్వీస్ బుక్స్ స్థానంలో డిజిటల్ సర్వీస్ బుక్ వ్యవస్థను తీసుకురావడానికి కసరత్తు వేగవంతం చేసింది. రాబోయే రెండు నుంచి మూడు నెలల్లో ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ కొత్త విధానంలో ప్రతి ఉద్యోగికి ప్రత్యేక యూజర్ ఐడి, పాస్‌వర్డ్ కేటాయించనున్నారు. ఉద్యోగంలో చేరిన రోజు నుంచి పదవీ…

