సినిమా రిలీజ్ కోసం కాలేజీకి సెలవా? మల్లారెడ్డి యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలి.. విద్యార్థి సంఘాల డిమాండ్!
తెలంగాణలో ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వహణ, విద్యార్థుల భద్రత, విద్యా ప్రమాణాలపై మరోసారి చర్చ మొదలైంది. సినిమా ప్రమోషన్ల కోసం కళాశాలలకు సెలవులు ప్రకటించడం, కాలేజీ ప్రాంగణాల్లో భారీ ఈవెంట్లు నిర్వహించడం, విద్యార్థుల చదువుకు ఆటంకం కలిగించడం వంటి అంశాలపై విద్యార్థి సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా మల్లారెడ్డి యూనివర్సిటీలో ప్రముఖ నటుడు వెంకటేష్ నటించిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా విడుదల సందర్భంగా ఈ నెల 30న సెలవు ప్రకటించినట్లు వచ్చిన వార్తలు వివాదానికి దారితీశాయి….

