శంకర్ దాదా MBBSలుగా నకిలీ వైద్యం.. హైదరాబాద్లో 12 మంది నకిలీ వైద్యుల అరెస్ట్!
హైదరాబాద్లో నకిలీ వైద్యుల వ్యవహారం మరోసారి కలకలం రేపింది. ఎలాంటి వైద్య అర్హతలు లేకుండానే డాక్టర్లుగా చెలామణి అవుతూ అమాయక ప్రజలకు వైద్యం చేస్తున్నారనే ఆరోపణలపై 12 మందిని సికింద్రాబాద్ జూబ్లీ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. చిన్న చిన్న క్లినిక్లు నిర్వహిస్తూ ప్రజలకు వైద్యం చేస్తున్న వీరిలో కొందరు ఫార్మసిస్టులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రజలకు అత్యవసర సమయంలో వైద్యం అందించే పేరుతో సరైన అర్హతలు లేకుండా చికిత్స…

