2025లో కాంగ్రెస్ పాలనపై తీవ్ర అసంతృప్తి.. పంచాయతీలు, పాలనా వైఫల్యాలు, ప్రజల ప్రశ్నలు

2025 సంవత్సరం తెలంగాణ రాజకీయాల్లో అన్ని పార్టీలకూ చేదు అనుభవాలనే మిగిల్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బిఆర్ఎస్, బిజెపీల తర్వాత కాంగ్రెస్ పార్టీ పాలన కూడా తీవ్ర విమర్శలకు లోనైంది. ముఖ్యంగా కాంగ్రెస్‌లో బీసీ వర్సెస్ రెడ్డి రాజకీయాలు తెరపైకి రావడం, అంతర్గత పంచాయతీలు రోడ్ల మీదకు రావడం పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ పంచాయతీలకు “కేర్ ఆఫ్ అడ్రస్” అన్నట్టుగా పరిస్థితి మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక మంత్రి మరో…

Read Full News

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆగ్రహం.. 10 వేల కోట్లు వెంటనే చెల్లించాలి: ఎస్. దుర్గయ్యగౌడ్

బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ ఎస్. దుర్గయ్యగౌడ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద సుమారు రూ.10 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. నిన్న ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.365.75 కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారని, అయితే…

Read Full News

దీపం ఉండగానే ఇల్లు సక్కదిద్దుకోవాలా? – పెళ్లిళ్లపై ప్రభుత్వ ఖర్చులపై తీవ్ర విమర్శలు”

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వ్యక్తిగత ఆరోపణలు, కుటుంబ రాజకీయాలు, ప్రభుత్వ వ్యవహారాలపై విమర్శలు తీవ్రం అవుతున్నాయి. ఇటీవల డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబంలో జరుగుతున్న వివాహ వేడుక సందర్భంగా, ప్రభుత్వ పెద్దల కుటుంబాల్లో వరుసగా జరుగుతున్న పెళ్లిళ్లు, వాటిలో ఖర్చులు, ప్రభుత్వ యంత్రాంగం వినియోగం, ప్రజా నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. భట్టి విక్రమార్క గారి కుమారుడు వివాహం నేపథ్యంలో, ఆయన భార్యపై “కలెక్షన్ క్వీన్” అంటూ వచ్చిన ఆరోపణలతో పాటు, మంత్రులు, ఎమ్మెల్యేలు,…

Read Full News

మో తుఫాన్ ప్రభావం: తెలంగాణలో రికార్డు వర్షాలు–రైతులు ఆందోళన, ప్రభుత్వ చర్యలపై విమర్శలు

మో తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వానలు పడటంతో రోడ్లు తెగిపోవడం, వాగులు, వంకలు పొంగిపొర్లడం, పంటలు తీవ్రంగా దెబ్బతినడం వంటి పరిస్థితులు నెలకొన్నాయి.ఉమ్మడి వరంగల్ జిల్లా భీమదేవరపల్లిలో 41.2 సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైంది. రైల్వే ట్రాకులు నీటమునగడంతో రైలు రవాణా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో రహదారి మార్గాలు దెబ్బతినడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పంటలు ముంచెత్తడంతో వరి, పత్తి సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళన…

Read Full News

విద్యార్థుల జీవితం ప్రమాదంలో: ఫీజు రీయింబర్స్‌మెంట్, జీతాలు నిలిచిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

ఎల్బీ నగర్ శాఖతో పాటు రంగారెడ్డి జిల్లా నాయకులు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలు కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు గుప్పించాయి. “ఇది న్యాయమైన పోరాటం, అవసరమైన డిమాండ్” అంటూ వారు ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మాది అధ్యక్షుడు రవీందర్ గారు, కార్పొరేటర్ లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో వారు ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. “పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తూ విద్యార్థుల…

Read Full News