యాప్‌తో యూరియా పంపిణీ రైతులకు భారంగా మారింది.. పాత విధానమే అమలు చేయాలని రైతుల విజ్ఞప్తి
తెలంగాణలో యూరియా పంపిణీ కోసం అమలు చేస్తున్న యాప్ ఆధారిత విధానం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకునే ప్రక్రియ వల్ల సమయానికి ఎరువు అందడం లేదని, గతంలో ఉన్న డీలర్ ఆధారిత పంపిణీ విధానాన్ని తిరిగి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రైతుల ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,…

