కేబీఆర్ పార్క్ చెట్ల నరికివేతపై సుప్రీం స్టే.. ఎకో సెన్సిటివ్ జోన్‌లో కీలక ఆదేశాలు
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేత వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో చెట్ల తొలగింపుపై అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల 25 నుంచి 35 మీటర్ల పరిధిలో ఉన్న చెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నరకరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కాజల్ మహేశ్వరి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఈ మేరకు స్టే ఇచ్చింది. కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాలు…

