తెలంగాణలో ఓట్ల తొలగింపుపై వివాదం.. ఖైరతాబాద్ ఉపఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై బీజేపీ ధీమా!
తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ, ఫారం-7 దరఖాస్తులు, ఓట్ల తొలగింపుపై రాజకీయ వివాదం కొనసాగుతోంది. ఈ అంశంపై బీజేపీ నేత రామచంద్రరావు, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య వివాదం నెలకొనడం, ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు చర్చ జరగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఖైరతాబాద్ ఉపఎన్నికతో పాటు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతి అర్హుడి ఓటును కాపాడాలి: బీజేపీ ముషీరాబాద్ ప్రాంతంలో ఓటర్ల…

