తెలంగాణలో బదిలీల్లో విచిత్రాలు.. పై ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్‌కు ట్రాన్స్‌ఫర్‌లు!
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో కొన్ని శాఖలు, కొందరు అధికారులు నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ విచిత్ర నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పరిపాలనా సౌలభ్యం, ఉద్యోగుల సమర్థ వినియోగం కోసం చేపట్టిన బదిలీలను కొందరు అధికారులు కేవలం కాగితాలకే పరిమితం చేస్తూ అసలు ఉద్దేశాన్ని నీరుగారుస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ఇటీవల సుదీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయాలని నిర్ణయించింది. అయితే ఈ నిబంధనలోని లొసుగులను ఆసరాగా చేసుకుని కొందరు అధికారులు…

