కబడ్డీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా కీలక అడుగులు.. కసాని జ్ఞానేశ్వర్ విజన్ అద్భుతం: ఉజ్బెకిస్థాన్ ప్రతినిధి అక్బర్
హైదరాబాద్: అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్ (IKF) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరుగుతున్న సమావేశంపై ఉజ్బెకిస్థాన్‌కు చెందిన కబడ్డీ ప్రతినిధి అక్బర్ ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్‌కు రావడం ఎంతో సంతోషంగా ఉందని, కబడ్డీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు జరుగుతున్న ప్రయత్నాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. ఉజ్బెకిస్థాన్ నుంచి వచ్చిన అక్బర్ మాట్లాడుతూ.. ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ కబడ్డీని మరో స్థాయికి తీసుకెళ్లే దిశగా ముందుకు సాగుతోందన్నారు. ముఖ్యంగా కసాని జ్ఞానేశ్వర్‌తో వ్యక్తిగతంగా మాట్లాడినట్లు, కబడ్డీని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలన్న ఆయన…

