తాంజానియాలో కబడ్డీకి కొత్త ఊపు.. స్కూళ్ల నుంచే యువ ప్రతిభను వెలికితీస్తాం: తాంజానియా కబడ్డీ ప్రతినిధులు
హైదరాబాద్: భారతదేశంలో జరుగుతున్న అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్ (IKF) సమావేశంలో పాల్గొన్న తాంజానియా కబడ్డీ ప్రతినిధులు.. తమ దేశంలో కబడ్డీని మరింత అభివృద్ధి చేసేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తామని తెలిపారు. హైదరాబాద్‌కు ఆహ్వానించిన IKF, కసాని జ్ఞానేశ్వర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తాంజానియా కబడ్డీ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దల్లా ముస్తఫా న్యోని, ఉపాధ్యక్షుడు మొహమ్మద్ జెంజా సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తాంజానియాలో కబడ్డీ భవిష్యత్తు, యువతలో క్రీడపై ఆసక్తి, భారత్‌తో సహకారం వంటి అంశాలపై వారు…

