ఇంచార్జ్ మంత్రులు డమ్మీలేనా? కాంగ్రెస్‌లో జిల్లాల వారీగా ముదురుతున్న అంతర్గత విభేదాలు
తెలంగాణ కాంగ్రెస్‌లో జిల్లా ఇంచార్జ్ మంత్రుల వ్యవస్థపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లాల్లో పార్టీ వ్యవహారాలను సమన్వయం చేయడం, స్థానిక నేతల మధ్య తలెత్తే విభేదాలను పరిష్కరించడం, ప్రభుత్వ కార్యక్రమాలను పర్యవేక్షించడం వంటి కీలక బాధ్యతలను ఇంచార్జ్ మంత్రులకు అప్పగించినప్పటికీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు ఇంచార్జ్ మంత్రులను సంప్రదించకుండా నేరుగా పార్టీ అధిష్ఠానాన్ని ఆశ్రయించడం, కీలక నిర్ణయాలను స్వయంగా…

