జార్ఖండ్లో విద్యార్థులపై లాఠీచార్జ్.. ఉద్యోగాల కోసం రోడ్డెక్కిన వేలాది మంది
రాంచీ: జార్ఖండ్లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు, అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తంగా మారింది. సోమవారం వేలాది మంది ఉద్యోగార్థులు జార్ఖండ్ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు లాఠీచార్జ్ చేశారు. పలువురు విద్యార్థులు గాయపడినట్లు వార్తా నివేదికలు వెల్లడించాయి. ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, పేపర్ లీక్ ఆరోపణలపై విద్యార్థులు ఇప్పటికే 17 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. తమ…

